త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GHMC | ఎల్లుండి నుంచి మరోసారి జీహెచ్ఎంసీ శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్

GHMC | గ్రేట‌ర్ హైద‌రాబాద్ (Greater Hyderabad) న‌గ‌ర వ్యాప్తంగా మ‌రోసారి శానిటేష‌న్ ప్ర‌త్యేక డ్రైవ్‌ (Sanitation Special Drive)ను ఈ నెల 29వ తేదీ నుంచి చేప‌ట్ట‌నున్న‌ట్లు జీహెచ్ఎంసీ (GHMC) క‌మిష‌న‌ర్ (Commissioner) ఆర్‌వీ క‌ర్ణ‌న్ (RV Karnan) తెలిపారు.

A

Hyderabad | Published On Dec 27, 2025, 6.01 pm IST

GHMC | ఎల్లుండి నుంచి మరోసారి జీహెచ్ఎంసీ శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్
Advertisement

పారిశుద్ధ్య పనులు ప్రభావంతంగా జరిగేలా చూడాల‌ని జెడ్‌సీ, డీసీల‌కు క‌మిష‌న‌ర్ ఆదేశం
ఆసుపత్రులు, స్కూల్ ఆవరణల్లో వీధి కుక్కలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం

GHMC | గ్రేట‌ర్ హైద‌రాబాద్ (Greater Hyderabad) న‌గ‌ర వ్యాప్తంగా మ‌రోసారి శానిటేష‌న్ ప్ర‌త్యేక డ్రైవ్‌ (Sanitation Special Drive)ను ఈ నెల 29వ తేదీ నుంచి చేప‌ట్ట‌నున్న‌ట్లు జీహెచ్ఎంసీ (GHMC) క‌మిష‌న‌ర్ (Commissioner) ఆర్‌వీ క‌ర్ణ‌న్ (RV Karnan) తెలిపారు. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి జోన్‌ల‌లో క్షేత్ర స్థాయి పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును సంబంధిత జోనల్ కమిషనర్‌లు రవి కిరణ్, సంచిత్‌ గంగ్వార్‌లతో కలిసి పరిశీలించారు. గాంధీ ఆసుపత్రి, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజా భద్రత, పారిశుధ్యం, పాదచారుల మౌలిక సదుపాయాలకు సంబంధించిన పరిస్థితులను తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో వీధి కుక్కల సమస్యను తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు తరలించబడిన కుక్కలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆసుపత్రి ప్రాంగణంలోకి తిరిగి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ (CVO), వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ తో కలిసి సంయుక్త తనిఖీ నిర్వహించాలని ఆదేశించారు. పాదచారుల సౌకర్యాలను సమీక్షించారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు ప్రభావ‌వంతంగా జరిగేలా మానిటరింగ్ చేయాలని జోన‌ల్ క‌మిష‌న‌ర్‌, డిప్యూటీ క‌మిష‌న‌ర్‌ల‌ను ఆదేశించారు. ఈ ప్ర‌త్యేక డ్రైవ్‌లో భాగంగా దీర్ఘకాలంగా పేరుకుపోయిన వ్యర్థాలు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణలోని కుక్కలను పట్టుకుని యానిమ‌ల్ కేర్‌ సెంటర్ల‌కు తరలించాలని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కుక్కల బెడద లేకుండా చూడాలని ఆదేశించారు. డిప్యూటీ డైరెక్టర్ స్థాయి వెటర్నరీ అధికారులు తమ పరిధిలోని అన్ని ఆసుపత్రులు, పాఠశాలలు, జనసమ్మర్థ‌క‌ ప్రదేశాలలో రోజువారీగా వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, వీధి కుక్కలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఆయా ప్రదేశాలలో కుక్క కాటు ఘటనలు జరిగితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వీధి కుక్కల బెడదపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు.

ఫుట్ పాత్ లపై పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించడం ద్వారా ఫుట్‌పాత్‌లను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. ఓల్డ్ అల్వాల్‌లో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ లను పరిశీలించారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా మానిటర్ చేయాలని అధికారులకు సూచించారు. రోడ్లు, వీధులను క్లీన్ గా ఉండేలా చూడాలన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement