త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Chamala Kirankumar | తాతా మ‌ధును సస్పెండ్ చేయాలి: ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్‌ డిమాండ్‌

MP Chamala Kirankumar | ద‌ళిత స్పీక‌ర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మ‌ధు చేసిన వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ స‌మాజం చూసింద‌ని.. ద‌ళితుల‌ను అవ‌మానించ‌డం బీజేపీ, బీఆర్ఎస్‌కు ఆన‌వాయితీగా మారింద‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ మండిప‌డ్డారు.

S

Hyderabad | Published On Sep 7, 2026, 4.57 pm IST

MP Chamala Kirankumar | తాతా మ‌ధును సస్పెండ్ చేయాలి: ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్‌ డిమాండ్‌
Advertisement
  • గాంధీభ‌వ‌న్ ప్రాంగ‌ణంలో దిష్టిబొమ్మ ద‌హ‌నం

MP Chamala Kirankumar | త్రినేత్ర‌.న్యూస్‌: ద‌ళిత స్పీక‌ర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మ‌ధు చేసిన వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ స‌మాజం చూసింద‌ని.. ద‌ళితుల‌ను అవ‌మానించ‌డం బీజేపీ, బీఆర్ఎస్‌కు ఆన‌వాయితీగా మారింద‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్షాలు స‌భ‌లో ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌శ్నించొచ్చ‌ని, కానీ ఇలా బూతులు మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు. భ‌విష్య‌త్‌లో ఇలాంటి ప‌రిస్థితులు ఉండొద్ద‌ని తాతా మ‌ధును త‌క్ష‌ణ‌మే స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈమేరకు గాంధీభ‌వ‌న్ ప్రాంగ‌ణంలో తాతా మ‌ధు దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. తాతా మ‌ధుకు వ్య‌తిరేకంగా పెద్ద‌పెట్టున నినాదాలు చేశారు.

బీజేపీకి, బీఆర్ఎస్‌కు ఆన‌వాయితీగా మారింది..

ఈ సంద‌ర్భంగా చామల మాట్లాడారు. ఒక ద‌ళిత స్పీక‌ర్‌పై ఏ విధంగా మాట్లాడిండో ఈరోజు తెలంగాణ స‌మాజం చూసింది. ద‌ళితుల‌ను అవ‌మానించ‌డం బీజేపీకి, బీఆర్ఎస్‌కు ఇది ఆన‌వాయితీగా మారింది. బీజేపీ వాళ్లు ఈ మ‌ధ్య‌కాలంలో మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేను ఎట్లా అవ‌మానించారో చూసినం. ఈరోజు అదే ప‌ద‌జాలం, బీఆర్ఎస్ పార్టీ నేత‌ స్పీక‌ర్ కుటుంబ స‌భ్యుల‌ను ఉద్దేశించి ఏ విధంగా బూతులు మాట్లాడిర్రో చూసినం. ఇటువంటి ప‌రిస్థితి ఎక్క‌డ ఉండొద్దు.

న‌ల్ల బ‌ట్ట‌లు వేసుకొని రావ‌డం కాదు.. కేసీఆర్‌ను స‌భ‌కు తీసుకుర‌మ్మ‌ని చెప్పినం. స‌భ‌ లోప‌ల ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌శ్నిస్తే ఎవ్వ‌రూ వ‌ద్ద‌న‌రు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నించొచ్చు. మేం వారిని అడ్డుకోలే. తాతా మ‌ధును స‌స్పెండ్ చేయాలి. మ‌మ్మ‌ల్ని బ‌ద్నాం చేయాల‌ని చూస్తున్నారు. భ‌విష్య‌త్‌లో ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డే ఎవ‌రైనా స‌రే ఈ విధ‌మైన భాష వాడొద్దు అని చామ‌ల సూచించారు.

Advertisement
Advertisement