OU to VCIWU | ఓయూ నుంచి కోఠి మహిళా యూనివర్సిటీకి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
OU to VCIWU | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులకు శుభవార్త. ఓయూ క్యాంపస్ నుంచి కోఠి మహిళా యూనివర్సిటీకి వెళ్లే విద్యార్థినులు, అధ్యాపకులతో పాటు ఇతర సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
OU to VCIWU | త్రినేత్ర న్యూస్ : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులకు శుభవార్త. ఓయూ క్యాంపస్( OU Campus ) నుంచి కోఠి మహిళా యూనివర్సిటీకి వెళ్లే విద్యార్థినులు, అధ్యాపకులతో పాటు ఇతర సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ మీదుగా వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (VCIWU) వరకు నడిచే బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచింది. పెంచిన బస్సు సర్వీసులు ఈ నెల 27 నుంచి అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
టీజీఎస్ ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులను కేటాయించడంతో.. మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ హర్షం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ రవాణా అవసరాలపై సానుకూలంగా స్పందించి సహకరించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగి రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంచూరి శ్రీధర్, ఇతర అధికారులు అందించిన సహకారం, సానుకూల స్పందనకు ధన్యవాదాలు తెలిపారు.
వీసీఐడబ్ల్యూయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గడ్డం మల్లేశం మాట్లాడుతూ.. బస్సుల ఫ్రీక్వెన్సీ పెంపుతో విద్యార్థులు, సిబ్బంది రోజువారీ రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గడంతో పాటు విద్యా, ఇతర యూనివర్సిటీ కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
సంబంధిత వార్తలు

Ward Officers | ఘన వ్యర్థాల నిర్వహణపై వార్డు అధికారులకు శిక్షణ
సెప్టెంబర్ 25, 2026

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
సెప్టెంబర్ 12, 2026

Valigonda Narasimha | మేస్త్రీ పని చేస్తూనే ఓయూ డాక్టరేట్ సాధించాడు.. వలిగొండ నరసింహ సక్సెస్ స్టోరీ ఇదీ..
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Women were beaten | కోర్టులో మహిళపై దాడి.. గొంతునులిమి దాడి చేసిన భర్త.. షాకింగ్ వీడియో
- ●Poompuhar | హైదరాబాద్‌లో 'పూంపుహార్' మెగా హస్తకళల ప్రదర్శన
- ●NASA | అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..
- ●Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు
- ●CEC Removal Process | సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.. అసలు ప్రక్రియ ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది!
- ●Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు

Women were beaten | కోర్టులో మహిళపై దాడి.. గొంతునులిమి దాడి చేసిన భర్త.. షాకింగ్ వీడియో

Poompuhar | హైదరాబాద్‌లో 'పూంపుహార్' మెగా హస్తకళల ప్రదర్శన

NASA | అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..

Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు



