త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

​TGSRTC | గ‌ణేశ్ ఉత్స‌వాలు.. ఖైర‌తాబాద్‌, బాలాపూర్‌కు ప్ర‌త్యేక బ‌స్సులు

​TGSRTC | ​వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ స్థాయిలో ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది.

S

Hyderabad | Published On Sep 12, 2026, 10.13 pm IST

​TGSRTC | గ‌ణేశ్ ఉత్స‌వాలు.. ఖైర‌తాబాద్‌, బాలాపూర్‌కు ప్ర‌త్యేక బ‌స్సులు
Advertisement

​TGSRTC | ​త్రినేత్ర‌.న్యూస్ : వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ స్థాయిలో ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14 నుండి 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి వెల్లడించారు.

నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లయిన జేబీఎస్ (JBS) మరియు ఎంజీబీఎస్ (MGBS) మీదుగా సాగే ఈ రవాణా సౌకర్యాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ​ఈ ప్రత్యేక బస్సులు జేబీఎస్ నుండి ప్రారంభమై ప్యాట్నీ, బాటా, బోట్ క్లబ్, ట్యాంక్ బండ్, ఐమాక్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, గాంధీ భవన్, అఫ్జల్‌గంజ్, సీబీఎస్/ఎంజీబీఎస్, విమెన్స్ కాలేజ్, జె.గార్డెన్, గవర్నమెంట్ ప్రెస్, ఐ.ఎస్. సదన్, పిసల్‌బండ, మిధాని టి.షిప్, బాలాపూర్ ఎక్స్ రోడ్, శివాజీ చౌక్ల మీదుగా బాలాపూర్ గణేష్ మండపానికి చేరుకుంటాయి.

భక్తుల రద్దీకి అనుగుణంగా జేబీఎస్ వద్ద ఉదయం 6:00 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమై రాత్రి 21:55 గంటల వరకు ప్రతి 40 నుండి 50 నిమిషాల వ్యవధితో నిరంతరాయంగా బస్సులు నడుస్తాయి.

అలాగే బాలాపూర్ గణేష్ మండపం నుండి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 గంటలకు ప్రారంభమై రాత్రి 23:50 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గణేష్ ఉత్సవాల వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎండీ నాగిరెడ్డి వివరించారు.

Advertisement
Advertisement