త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bullet Train Project | బహదూర్‌గూడలో ఉద్రిక్త‌త‌.. భూముల స్వాధీన భారీగా చేరుకున్న హైడ్రా అధికారులు

Bullet Train Project | శంషాబాద్ మండ‌లం బ‌హ‌దూర్‌గూలో (Bahadurguda) తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు (Bullet Train Project) కోసం భూములు ఇచ్చేందుకు నిరాక‌రిస్తున్న రైతులు.. త‌మ‌కు స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు.

G

Hyderabad | Published On Jul 18, 2026, 7.56 am IST

Bullet Train Project | బహదూర్‌గూడలో ఉద్రిక్త‌త‌.. భూముల స్వాధీన భారీగా చేరుకున్న హైడ్రా అధికారులు
Advertisement

Bullet Train Project | త్రినేత్ర‌.న్యూస్‌: శంషాబాద్ మండ‌లం బ‌హ‌దూర్‌గూలో (Bahadurguda) తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు (Bullet Train Project) కోసం భూములు ఇచ్చేందుకు నిరాక‌రిస్తున్న రైతులు.. త‌మ‌కు స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం ఉద‌యం హైడ్రా (HYDRAA) అధికారులు పెద్ద సంఖ్య‌లో సిబ్బందితో బ‌హ‌దూర్‌గూడ‌కు చేరువడంతో హై టెన్షన్ నెలకొంది.

తాము అభివృద్ధికి వ్య‌తిరేకం కాద‌ని, అయితే స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చి భూములు తీసుకోవాలంటూ గ‌త ఐదు రోజులుగా రైతులు నిర‌స‌న చేస్తున్నారు. ప‌రిహారం, పున‌రావాసం, భ‌విష్య‌త్‌పై స్ప‌ష్ట‌త ఇచ్చిన త‌ర్వాతే భూముల స్వాధీన ప్ర‌క్రియ చేప‌ట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే భూముల స్వాధీన ప్ర‌క్రియ‌లో భాగంగా హైడ్రా అధికారులు బ‌హ‌దూర్‌గూడ‌కు చేరుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా పెద్ద సంఖ్య‌లో పోలీసులు మోహ‌రించారు.

బ‌హ‌దూర్‌గూడ నుంచే ప్రారంభం..

శంషాబాద్ విమానాశ్ర‌యం స‌మీపంలోని బ‌హ‌దూర్‌గూడ వ‌ద్ద బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం 600 ఎక‌రాల భూమిని కేటాయించింది. ఇక్క‌డి నుంచే మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ఏర్పాటు చేయ‌నున్నారు. ఇందులో భాగంగా శంషాబాద్‌-ముంబై, హైద‌రాబాద్‌-చెన్నై, హైద‌రాబాద్-బెంగ‌ళూరు కారిడార్లు ఏర్పాటు కానున్నాయి.

హైదరాబాద్-ముంబై బుల్లెట్ రైలు కారిడార్ (Mumbai Corridor) బహదూర్ గూడ వద్ద ప్రారంభమ‌వుతుంది. మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్‌ మీదుగా ముంబై వరకు ఈ కారిడార్ ఉంటుంది. ఈ కారిడార్ మార్గం కోసం అధికారులు మార్కింగ్ ప‌నులు చేస్తున్నారు. ఎక్కువగా వ్యవసాయ పొలాల నుంచే ఈ మార్గం వెళుతుండ‌టంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూములు కోల్పోతే త‌మ భ‌విష్య‌త్ ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. శంషాబాద్‌ మంలంలోని చౌదరిగూడ, సుల్తాన్‌పల్లి, కేబీదొడ్డి గ్రామాలతో పాటు మొయినాబాద్‌ మండలంలోని అమ్డాపూర్, సురంగల్, కేతిరెడ్డిపల్లి కూడళ్లల్లో మార్కింగ్‌లు వేశారు. ప్రతీ 5 కిలోమీటర్లకు ఒకచోట ఎలాంటి వంకరలు లేకుండా వేస్తున్నారు. నాలుగు వరుసల్లో బుల్లెట్ ట్రైన్ల కోసం కారిడార్ నిర్మించనుండగా.. రెండువైపులా సర్వీస్ రోడ్లను కూడా నిర్మించున్నారు. దీంతో 300 అడుగుల వెడల్పుతో భూసేకరణ చేయ‌నున్నారు.

Advertisement
Advertisement