త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు ఓటు.. ప్ర‌తిఒక్క‌రు సద్వినియోగం చేసుకోవాలి: మాజీ మంత్రి త‌ల‌సాని

Talasani Srinivas Yadav | ఓటు (Vote) అనేది రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు అని, దానిని ప్ర‌తిఒక్క‌రు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ప్రతి ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలి అనడం సరైంది కాదని చెప్పారు.

G

Hyderabad | Published On Oct 11, 2026, 1.00 pm IST

Talasani Srinivas Yadav | రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు ఓటు.. ప్ర‌తిఒక్క‌రు సద్వినియోగం చేసుకోవాలి: మాజీ మంత్రి త‌ల‌సాని
Advertisement

Talasani Srinivas Yadav | త్రినేత్ర న్యూస్‌: ఓటు (Vote) అనేది రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు అని, దానిని ప్ర‌తిఒక్క‌రు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ప్రతి ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలనడం సరైంది కాదని చెప్పారు. అర్హులైన నూతన గ్రాడ్యుయేట్‌లు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకునే విధానం రావాల‌న్నారు. స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన గ్రాడ్యుయేట్ ఓట‌ర్ న‌మోదు కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. 50, 60 ఏండ్లు ఉన్న గ్రాడ్యుయేట్లు కూడా ప్రతిసారి ఓటు నమోదు చేసుకోవాలా అని ప్ర‌శ్నించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్క‌ర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు ఎంతో గౌరవిస్తున్నాయ‌ని చెప్పారు. భారత ఎన్నికల కమిషన్ (ECI) రాజ్యాంగం (Constitution) కల్పించిన హక్కులను కాలరాస్తుందని విమ‌ర్శించారు. ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఓట్లను తొలగించే అధికారం ఎవరిచ్చారని ప్ర‌శ్నించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల కమిషన్ తీరును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పారు. న్యాయస్థానాలు కూడా ఎన్నికల కమిషన్ వైఖరిని తప్పుబట్టాయని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. నవంబర్ 6వ‌ తేదీలోగా అర్హులైన గ్రాడ్యుయేట్‌లు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement