Septic Tank deaths | హైదరాబాద్‌లో ఘోరం.. సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక ఎంతమంది యువకులు చనిపోయారంటే!
Septic Tank deaths | కార్తీక పౌర్ణమి వేళ హైదరాబాద్ (Hyderabad) నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. సెప్టిక్ ట్యాంకు(Septic Tank)లో ఊపిరాడక ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
Septic Tank deaths | త్రినేత్ర న్యూస్: కార్తీక పౌర్ణమి వేళ హైదరాబాద్ (Hyderabad) నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ట్యాంకు శుభ్రం చేస్తుండగా విషవాయువులకు గాలి ఆడకపోవడంతో మృతి చెందినట్లు సమాచారం. బాచుపల్లి (Bachupally) పరిధిలోని దినేష్ ఆర్‌కే అపార్ట్‌మెంట్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
మొదట ఓ కార్మికుడు ట్యాంక్‌లోకి దిగగా విషవాయువుల తీవ్రతకు ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని కాపాడేందుకు మిగిలిన ఇద్దరు కార్మికులు కూడా ట్యాంక్‌లోకి దిగగా, వారు కూడా ఊపిరాడక కుప్పకూలి మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతులను హెచ్ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కంపెనీకి చెందిన సుమన్ (Suman) (24), సురేశ్ (Suresh) (25), పవన్ (Pawan) (25)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Edits App | ఎడిట్స్ ఐప్యాడ్ యాప్‌లో కొత్త ఫీచర్లు.. ఇక ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ మరింత సులభం..
- ●BJP-SAD alliance | మళ్లీ ఎన్డీయే గూటికి అకాలీదళ్.. పంజాబ్ ఎన్నికల్లో కలిసి పోటీ
- ●Sadhguru On Dead Person Clothes | చనిపోయిన వారి బట్టలు ఎందుకు వేసుకోకూడదు? వాటిని ఏం చేయాలి?
- ●Green India Challenge | కార్తీక హరిత సంకల్పం.. హిల్స్ కాలనీలో ఉసిరి, బిల్వ మొక్కల పంపిణీ
- ●Bisleri | మినరల్ వాటర్‌లో ఉండే బ్రోమేట్ ఆరోగ్యానికి ఎలా హానికరం..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
- ●Delhi High Court | తండ్రి ఇంటిని ఖాళీ చేయాల్సిందే.. కొడుకు, కోడలికి కోర్టు షాక్..!

Edits App | ఎడిట్స్ ఐప్యాడ్ యాప్‌లో కొత్త ఫీచర్లు.. ఇక ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ మరింత సులభం..

BJP-SAD alliance | మళ్లీ ఎన్డీయే గూటికి అకాలీదళ్.. పంజాబ్ ఎన్నికల్లో కలిసి పోటీ

Sadhguru On Dead Person Clothes | చనిపోయిన వారి బట్టలు ఎందుకు వేసుకోకూడదు? వాటిని ఏం చేయాలి?

Green India Challenge | కార్తీక హరిత సంకల్పం.. హిల్స్ కాలనీలో ఉసిరి, బిల్వ మొక్కల పంపిణీ





