Portronics Lithius Pro | పోర్ట్రోనిక్స్ కొత్త డబుల్ అండ్ ట్రిపుల్ ఎ సైజ్ బ్యాటరీలు.. యూఎస్‌బీ టైప్ సి తోనే ఛార్జింగ్..
Portronics Lithius Pro | పోర్ట్రోనిక్స్ తాజాగా లిథియస్ ప్రొ పేరుతో కొత్త రీచార్జబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ సిరీస్‌ను లాంచ్ చేసింది. గతేడాది విడుదల చేసిన లిథియస్ సిరీస్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ కొత్త బ్యాటరీలు ఎఎ, ఎఎఎ సైజ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా యూఎస్‌బీ టైప్ సి పోర్టును అంతర్గతంగా ఏర్పాటు చేశారు.
Portronics Lithius Pro | పోర్ట్రోనిక్స్ తాజాగా లిథియస్ ప్రొ పేరుతో కొత్త రీచార్జబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ సిరీస్‌ను లాంచ్ చేసింది. గతేడాది విడుదల చేసిన లిథియస్ సిరీస్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ కొత్త బ్యాటరీలు ఎఎ, ఎఎఎ సైజ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా యూఎస్‌బీ టైప్ సి పోర్టును అంతర్గతంగా ఏర్పాటు చేశారు. దీంతో ప్రత్యేకమైన ఛార్జర్ లేదా డాక్ అవసరం లేకుండానే సాధారణ టైప్ సి కేబుల్‌తో బ్యాటరీలను ఛార్జ్ చేసుకోవచ్చు. లిథియస్ ప్రొ ఎఎఎ బ్యాటరీ 542 ఎంఏహెచ్, 814 ఎంవాట్‌హెచ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. లిథియస్ ప్రొ ఎఎ బ్యాటరీ 2,066 ఎంఏహెచ్, 3,100 ఎంవాట్‌హెచ్ సామర్థ్యంతో వచ్చింది. గతేడాది వచ్చిన లిథియస్ మోడళ్లతో పోలిస్తే ఈ బ్యాటరీల్లో సామర్థ్యం గణనీయంగా పెరిగింది. కొత్త మోడళ్లు తెలుపు రంగుకు బదులుగా నలుపు రంగులో లభిస్తున్నాయి.
ఫీచర్లు ఇవే..
లిథియస్ ప్రొ ఎఎఎ బ్యాటరీ 1.5 వోల్టుల అవుట్‌పుట్‌ను, ఎఎ వేరియంట్ 1.5 వోల్టుల నుంచి 2 వోల్టుల వరకు అవుట్‌పుట్‌ను అందిస్తుంది. రిమోట్ కంట్రోళ్లు, కీబోర్డులు, వైర్‌లెస్ మౌస్‌లు, బొమ్మలు, కెమెరాలు, గేమింగ్ కంట్రోలర్లు, ల్యాంపులు, క్లాక్‌లు వంటి వివిధ పరికరాల్లో వీటిని ఉపయోగించవచ్చు. ప్రతి బ్యాటరీలో స్మార్ట్ ఎల్‌ఈడీ సూచికను అందించారు. ఛార్జింగ్ జరుగుతున్న సమయంలో ఇది బ్లింక్ అవుతుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఎల్‌ఈడీ లైట్ స్థిరంగా వెలుగుతుంది. దీంతో బ్యాటరీ ఛార్జింగ్ పూర్తయిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. భద్రత పరంగా కూడా ఈ బ్యాటరీల్లో పలు రక్షణ వ్యవస్థలను అందించారు. లీక్ ప్రూఫ్ రీన్‌ఫోర్స్డ్ షెల్‌తోపాటు షార్ట్ సర్క్యూట్ నివారణ, ఓవర్ వోల్టేజ్ రక్షణ, సర్జ్ ప్రొటెక్షన్, వేడెక్కకుండా నియంత్రించే వ్యవస్థ, ఓవర్ డిశ్చార్జ్ రక్షణ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎక్కువ కాలం ఉపయోగించకుండా ఉంచిన సమయంలోనూ బ్యాటరీ ఛార్జ్‌ను నిల్వ ఉంచేలా వీటిని రూపొందించారు. దీంతో తరచూ చార్జ్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది.
ధర ఎంతంటే..
లిథియస్ ప్రొ ఎఎఎ బ్యాటరీల జత ధర రూ.499గా ఉంది. లిథియస్ ప్రొ ఎఎ బ్యాటరీల జత ధరను రూ.549గా నిర్ణయించారు. ఈ ఉత్పత్తులు పోర్ట్రోనిక్స్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నయ్.. అమిత్ షా హౌస్‌లోకి వస్తలేరు
- ●Priyanka | ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి వాకిటి శ్రీహరి
- ●Harish Rao | కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి.. రైతుల ఇబ్బందులను పట్టించుకోండి: హరీశ్ రావు
- ●PM Modi | మీ ప్రతి కన్నీటి చుక్కా బంగారు పతకంతో సమానం.. కామన్వెల్త్ పతక విజేతలను అభినందించిన ప్రధాని మోదీ
- ●Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ భారీ డీల్.. భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రంగంలోకి అడుగు..
- ●Sri Chaitanya School | కర్రలతో కొట్టి.. బూట్లతో తొక్కారు.. దమ్మాయిగూడ శ్రీచైతన్య సూల్లో పదో తరగతి విద్యార్థిపై సహచరుల దాడి..

Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నయ్.. అమిత్ షా హౌస్‌లోకి వస్తలేరు

Priyanka | ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి వాకిటి శ్రీహరి

Harish Rao | కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి.. రైతుల ఇబ్బందులను పట్టించుకోండి: హరీశ్ రావు

PM Modi | మీ ప్రతి కన్నీటి చుక్కా బంగారు పతకంతో సమానం.. కామన్వెల్త్ పతక విజేతలను అభినందించిన ప్రధాని మోదీ




