త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Raids | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భైంసా మున్సిపల్ డీఈ.. ఎలా దొరికాడంటే!

ACB Raids | త‌ర‌చూ ఏసీబీ దాడు (ACB Raids)ల్లో ప‌ట్టుబ‌డుతున్నా ప్ర‌భుత్వ అధికారుల్లో ఇసుమంత కూడా మార్పు రావ‌డం లేదు. తాజాగా భైంసా (Bhaimsa) మున్సిప‌ల్ డీఈ సంతోశ్ జాద‌వ్ (DE Santhosh Jadav) లంచం తీసుకుంటూ ఏసీబీ వ‌ల‌కు చిక్కాడు.

S

Telangana | Published On Nov 10, 2026, 7.11 pm IST

ACB Raids | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భైంసా మున్సిపల్ డీఈ.. ఎలా దొరికాడంటే!
Advertisement

ACB Raids | త్రినేత్ర న్యూస్: త‌ర‌చూ ఏసీబీ దాడు (ACB Raids)ల్లో ప‌ట్టుబ‌డుతున్నా ప్ర‌భుత్వ అధికారుల్లో ఇసుమంత కూడా మార్పు రావ‌డం లేదు. త‌మ చేతివాటం చూపిస్తూ అందిన‌కాడికి దండుకుంటున్నారు. తాజాగా భైంసా (Bhaimsa) మున్సిప‌ల్ డీఈ సంతోశ్ జాద‌వ్ (DE Santhosh Jadav) లంచం (Bribe) తీసుకుంటూ ఏసీబీ వ‌ల‌కు చిక్కాడు.

నిర్మల్‌లో ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.2.60 లక్షల బిల్లు కోసం రూ.50 వేలు డిమాండ్‌ చేశారు. ముందస్తు సమాచారంతో దాడులు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు. సంతోష్ జాదవ్ కారులో వెళ్తుండ‌గా సినీ ఫ‌క్కీలో వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆత‌ని ఇంట్లో విచారణ కొన‌సాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement