త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Police | న‌గ‌రంలోని మూడు పోలీస్ క‌మిష‌న‌రేట్‌ల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌

Police | జీహెచ్ఎంసీ (GHMC) పున‌ర్విభ‌జ‌న నేప‌థ్యంలో న‌గ‌రంలో మూడు పోలీస్ క‌మిష‌న‌రేట్‌ (Police Commissionerate)ల‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు పోలీస్ (Police) శాఖలో కీలక మార్పులు జ‌రుగ‌నున్నాయి. మూడు క‌మిష‌న‌రేట్‌ల‌ను 12 జోన్లుగా విభ‌జించ‌నున్నారు. 

A

Hyderabad | Published On Dec 28, 2025, 2.42 pm IST

Police | న‌గ‌రంలోని మూడు పోలీస్ క‌మిష‌న‌రేట్‌ల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌
Advertisement

Police | జీహెచ్ఎంసీ (GHMC) పున‌ర్విభ‌జ‌న నేప‌థ్యంలో న‌గ‌రంలో మూడు పోలీస్ క‌మిష‌న‌రేట్‌ (Police Commissionerate)ల‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు పోలీస్ (Police) శాఖలో కీలక మార్పులు జ‌రుగ‌నున్నాయి. మూడు క‌మిష‌న‌రేట్‌ల‌ను 12 జోన్లుగా విభ‌జించ‌నున్నారు. హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్‌ (Hyderabad Commissionerate)లో ఆరు జోన్లు, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ల‌లో మూడు చొప్పున జోన్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ (Cyberabad Commissionerate)ప‌రిధిలో ఉన్న శంషాబాద్‌, రాజేంద్ర‌న‌గ‌ర్ జోన్ల‌ను హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్‌లో విలీనం చేయ‌నున్నారు. ఇక‌నుంచి శంషాబాద్ విమానాశ్ర‌యం సైతం హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్‌లోనే ఉండ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాచకొండ పోలీస్ క‌మిష‌న‌రేట్‌ (Rachakonda Commissionerate)లో ఉన్న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాను జిల్లా ఎస్పీ ప‌రిధిలోకి తీసుకురానున్నారు. మ‌హేశ్వ‌రం జోన్‌, షాద్‌న‌గ‌ర్‌, చేవెళ్ల‌ల‌ను కలుపుతూ ఫ్యూచ‌ర్ సిటీ పోలీస్ క‌మిష‌న‌రేట్‌ను ఏర్పాటు చేసే యోచ‌న‌లో పోలీసు బాసులు ఉన్న‌ట్లు విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం.

హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ జోన్ల వివ‌రాలు

చార్మినార్ జోన్‌
గోల్కొండ జోన్‌
ఖైర‌తాబాద్ జోన్‌
రాజేంద్రనగర్ జోన్
సికింద్రాబాద్ జోన్
శంషాబాద్ జోన్

సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ జోన్ల వివ‌రాలు

శేరిలింగంపల్లి జోన్ (మొయినాబాద్ నుంచి పటాన్ చెరు దాకా)
కూకట్‌ప‌ల్లి జోన్ (ఈ జోన్‌లోనే మాదాపూర్‌)
కుత్బుల్లాపూర్ జోన్

రాచకొండ మిష‌న‌రేట్ జోన్ల వివ‌రాలు

ఎల్బీ నగర్ జోన్
మల్కాజిగిరి జోన్
ఉప్పల్ జోన్

Advertisement

తాజావార్తలు

Advertisement