త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medchal Malkajgiri | ‘ప‌ది’ బాలిక‌తో ‘ఫిజిక్స్’ స‌ర్ ల‌వ్.. ర‌హ‌స్యంగా పెళ్లి..!

Medchal Malkajgiri | విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు వ‌క్ర‌బుద్ధిలో ప‌య‌నించాడు. విద్యార్థుల‌ను ఉన్న‌తంగా తీర్చిదిద్దాల్సింది పోయి.. వారితో త‌ప్ప‌ట‌డుగులు వేశాడు. త‌ర‌గ‌తి గ‌దిలోనే ప్రేమ పాఠాలు బోధిస్తూ.. అమాయ‌క బాలిక‌ను మోసం చేశాడు.

S

Hyderabad | Published On Feb 10, 2026, 6.27 am IST

Medchal Malkajgiri | ‘ప‌ది’ బాలిక‌తో ‘ఫిజిక్స్’ స‌ర్ ల‌వ్.. ర‌హ‌స్యంగా పెళ్లి..!
Advertisement

Medchal Malkajgiri | త్రినేత్ర‌.న్యూస్ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు వ‌క్ర‌బుద్ధిలో ప‌య‌నించాడు. విద్యార్థుల‌ను ఉన్న‌తంగా తీర్చిదిద్దాల్సింది పోయి.. వారితో త‌ప్ప‌ట‌డుగులు వేశాడు. త‌ర‌గ‌తి గ‌దిలోనే ప్రేమ పాఠాలు బోధిస్తూ.. అమాయ‌క బాలిక‌ను మోసం చేశాడు. ఓ బాలిక‌ను ప్రేమిస్తున్న‌ట్లు మాయ‌మాట‌లు చెప్పి.. ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. పోచారం డివిజ‌న్‌కు చెందిన ఓ బాలిక స్థానికంగా ఉన్న ఓ ప్ర‌యివేటు పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతుంది. ఇదే పాఠ‌శాల‌లో ప‌ర్రే మైటీన్(27) అనే ఉపాధ్యాయుడు ఫిజిక్స్ బోధిస్తున్నాడు. ఇక ఫిజిక్స్ స‌ర్.. బాలిక‌పై క‌న్నేశాడు. ఆమెకు మాయ‌మాట‌లు చెప్పాడు. ప్రేమిస్తున్నాన‌ని న‌మ్మించాడు. బాలిక కూడా న‌మ్మి.. అత‌ని మాయ‌లో ప‌డిపోయింది. ఇద్ద‌రు క‌లిసి ర‌హ‌స్యంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

బాలిక మెడ‌లో ప‌సుపు తాడు..

సీన్ క‌ట్ చేస్తే 20 రోజుల కింద‌ట బాలిక‌ మెడ‌లో ప‌సుపు తాడు ప్ర‌త్య‌క్ష‌మైంది. ప‌సుపు తాడు ఏంటి..? అని త‌ల్లి ప్ర‌శ్నించింది. దీంతో ఆందోళ‌న‌కు గురైన బాలిక జ‌రిగిన విష‌యాన్ని త‌ల్లికి చెప్పింది. ఆగ్ర‌హావేశాల‌కు లోనైన త‌ల్లిదండ్రులు, స్థానికులు క‌లిసి పాఠ‌శాల వ‌ద్ద‌కు వెళ్లి ఆందోళ‌న‌కు దిగారు. పిల్ల‌ల‌కు పాఠాలు బోధించ‌కుండా.. ఇదేం పాడుప‌ని అంటూ నిప్పులు చెరిగారు. పాఠ‌శాల యాజ‌మాన్యం నుంచి నిర్ల‌క్ష్య‌పు స‌మాధానం రావ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పర్రే మైటీన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ బి.రాజువర్మ తెలిపారు.

Advertisement
Advertisement