త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sumathi | పచ్చ‌ద‌నం బాగుంది.. ప్ర‌జ‌ల‌కు పార‌ద‌ర్శ‌క సేవ‌లు అందించండి: సీపీ సుమ‌తి

CP Sumathi | కీస‌ర పోలీస్ స్టేష‌న్‌లో ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త బాగుంద‌ని.. అలాగే ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత‌, పార‌ద‌ర్శ‌క‌, స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీసు సేవ‌లు అందించాల‌ని మ‌ల్కాజిగిరి సీపీ బి.సుమ‌తి సూచించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డులు, వివిధ విభాగాల నిర్వహణ, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.

S

Hyderabad | Published On Jun 1, 2026, 2.57 pm IST

CP Sumathi | పచ్చ‌ద‌నం బాగుంది.. ప్ర‌జ‌ల‌కు పార‌ద‌ర్శ‌క సేవ‌లు అందించండి: సీపీ సుమ‌తి
Advertisement

CP Sumathi | త్రినేత్ర‌.న్యూస్: కీస‌ర పోలీస్ స్టేష‌న్‌లో ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త బాగుంద‌ని.. అలాగే ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత‌, పార‌ద‌ర్శ‌క‌, స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీసు సేవ‌లు అందించాల‌ని మ‌ల్కాజిగిరి సీపీ బి.సుమ‌తి సూచించారు. సోమ‌వారం ఆమె కీసర పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డులు, వివిధ విభాగాల నిర్వహణ, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. స్టేష‌న్‌కు వచ్చిన బాధితుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌లు తెలుసుకుని సూచ‌న‌లిచ్చారు.

అనంతరం క్రైమ్ విభాగం సిబ్బందితో, రిసెప్షన్, ఇతర విభాగల సిబ్బందితో మాట్లాడి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించిన సీపీ, అక్కడి పరిశుభ్రత, పచ్చదనం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

విభాగాల ఇన్‌చార్జిలు, స్టేషన్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై విధుల నిర్వహణలో మరింత చురుకుదనం ప్రదర్శించాలని ఆదేశించారు. సాంకేతిక యాప్‌ల వినియోగం, NPDS కేసుల దర్యాప్తు, Mee Suraksha అప్లికేషన్‌లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కీసర ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు, యస్ ఐ లు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement