TGPSC | నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మూడు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు
TGPSC | రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం రెండేండ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన మూడు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
రేపు 3,800 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ
అత్యధికంగా అటవీశాఖలోనే
ఇక నుంచి ప్రతి నెల 2, 3 నోటిఫికేషన్లు
ఓఎంఆర్ పద్ధతికి స్వస్తి
ఆన్‌లైన్‌లో విధానంలోనే ప్రతి పరీక్ష
టీజీపీఎస్సీలో భారీ సంస్కరణలు
వెల్లడించిన చైర్మన్ బుర్రా వెంకటేశం
TGPSC | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం రెండేండ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన మూడు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక నుంచి ప్రతి నెల 2, 3 నోటిఫికేషన్లు ఇస్తాం. ప్రస్తుతం 3,800 పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించింది. ముఖ్యంగా అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 3,093 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 28 రకాల పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది. ఇంకో 25 రకాల పోస్టుల్లో 5 కంటే తక్కువ ఖాళీలు ఉన్నాయన్నారు. జూన్ నెలలోనే మరిన్ని నోటిషికేషన్లు విడుదల చేస్తామని బుర్రా వెంకటేశం ప్రకటించారు.
సీబీటీ విధానంలోనే రాత పరీక్షలు
ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువస్తున్నట్లు చైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. భవిష్యత్‌లో జరగబోయే ఉద్యోగ నియామక పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలోనే నిర్వహిస్తామన్నారు. రాత పరీక్షలన్నీ పారదర్శకంగా, లీకేజీలకు తావు లేకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
తమది చాలా క్లిష్టమైన ఉద్యోగం
టీజీపీఎస్సీ చైర్మన్ ఉద్యోగం అనేది చాలా క్లిష్టమైనది అని, అందర్నీ మెప్పించడం సాధ్యం కాదన్నారు బుర్రా వెంకటేశం. అందరికీ ఉద్యోగాలు ఇవ్వడమనేది సాధ్యం కాదు.. టీజీపీఎస్సీపై అసత్య ప్రచారం చేసేవారు ఎప్పుడూ ఉంటారని తెలిపారు.
మీడియాతో మాట్లాడడమే మంచిది..
మీడియాతో మాట్లాడకపోవడం కంటే మాట్లాడడమే మంచిదని భావిస్తున్నాం. ఇక నుంచి 2, 3 నెలలకోసారి మీడియా సమావేశాలు నిర్వహించి.. ఉద్యోగ నియామకాలతో పాటు తదితర అంశాలపై వివరంగా మాట్లాడుతామని బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Tollywood | నాగార్జున, రాజశేఖర్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ - గ్రాండ్‌గా లాంఛ్ కానీ....
- ●ICC Meeting | టెస్టులు, టీ20ల్లో కీలక మార్పులు.. ఐసీసీ బోర్డు మీటింగ్ గ్రీన్ సిగ్నల్..
- ●Revanth Reddy | నదీ జలాల విడుదలపై ఎగువ రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలి: సీఎం రేవంత్
- ●72 LPA Job Offer Rejected | రూ.72 లక్షల భారీ ప్యాకేజీని రిజెక్ట్ చేసిన టెకీ: కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- ●Congress leader attacked | పిల్లలు క్రికెట్ ఆడారని తల్లిదండ్రులపై దాడి.. ఆపై పోలీసుల సాక్షిగా కాళ్లు మొక్కించుకున్న కాంగ్రెస్ నేత
- ●itel Aqua | రూ.1,799కే వాటర్‌ప్రూఫ్ ఫీచర్ ఫోన్.. ఐటెల్ ఆక్వా ఎంట్రీ..

Tollywood | నాగార్జున, రాజశేఖర్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ - గ్రాండ్‌గా లాంఛ్ కానీ....

ICC Meeting | టెస్టులు, టీ20ల్లో కీలక మార్పులు.. ఐసీసీ బోర్డు మీటింగ్ గ్రీన్ సిగ్నల్..

Revanth Reddy | నదీ జలాల విడుదలపై ఎగువ రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలి: సీఎం రేవంత్

72 LPA Job Offer Rejected | రూ.72 లక్షల భారీ ప్యాకేజీని రిజెక్ట్ చేసిన టెకీ: కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!





