త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NSUI Chhatron Ki Goonj | ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా కేంద్రానికి రూ.1.30 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నా ఆగని పేపర్ లీకేజీలు

హైదరాబాద్ జేఎన్‌టీయూలో జరిగిన 'ఛాత్రోంకి గూంజ్'లో కేంద్రం, పేపర్ లీక్‌లపై NSUI చీఫ్ వినోద్ జాఖర్, బల్మూర్ వెంకట్ ఫైర్. మంత్రి రాజీనామాకు డిమాండ్.

J

Hyderabad | Published On Jul 20, 2026, 5.15 pm IST

NSUI Chhatron Ki Goonj | ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా కేంద్రానికి రూ.1.30 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నా ఆగని పేపర్ లీకేజీలు
Advertisement
  • హైదరాబాద్ JNTUలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థి గర్జన కార్యక్రమం
  • నీట్, యూపీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా కేంద్రానికి రూ.1.30 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నా పేపర్ లీకేజీలు ఆగడం లేదని విమర్శ
  • పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తప్పుకోవాలని NSUI పట్టు
  • కేంద్ర ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టేందుకే ఈ కార్యక్రమం అని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ స్పష్టీకరణ

NSUI Chhatron Ki Goonj | త్రినేత్ర.న్యూస్ : దేశంలోని విద్యావ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర విద్యావ్యవస్థలోని లోపాలను, జరుగుతున్న అక్రమాలను దేశవ్యాప్తంగా విద్యార్థులకు తెలియజేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఛాత్రోంకి గూంజ్' (Chhatron Ki Goonj) కార్యక్రమం హైదరాబాద్‌లో విజయవంతంగా జరిగింది.

జేఎన్‌టీయూ (JNTU) క్యాంపస్‌లో నిర్వహించిన ఈ విద్యార్థి గర్జన సదస్సుకు NSUI జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరై కేంద్ర తీరుపై నిప్పులు చెరిగారు.

రూ.1.30 లక్షల కోట్ల ఆదాయం.. కానీ పేపర్లు భద్రం కాదు

ఈ కార్యక్రమంలో వినోద్ జాఖర్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన గణాంకాన్ని బయటపెట్టారు. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ (NEET), ఐఐటీ (IIT), యూపీఎస్సీ (UPSC) లాంటి వివిధ ఎంట్రన్స్ పరీక్షల ఫీజుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏటా సుమారు రూ. 1 లక్షా 30 వేల కోట్ల భారీ ఆదాయం వస్తోందని ఆయన తెలిపారు.

"ఇది కేంద్రంలోని దాదాపు ఐదు ప్రభుత్వ శాఖల వార్షిక బడ్జెట్ (Budget) తో సమానం. విద్యార్థుల నుంచి ఇంత భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేస్తున్నా.. కనీసం పరీక్షలను పారదర్శకంగా నిర్వహించలేకపోతున్నారు. వరుస పేపర్ లీకేజీలు (Paper Leaks), ఎగ్జామ్స్ రద్దు వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు," అని ఆయన మండిపడ్డారు.

మంత్రి వెంటనే రాజీనామా చేయాలి

గత పన్నెండేండ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిందని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ విమర్శించారు. విద్యావ్యవస్థలో జరుగుతున్న ఈ దోపిడీని, పాలకుల వైఫల్యాలను ప్రతి ఒక్కరికీ తెలియజేయడానికే ఈ 'ఛాత్రోంకి గూంజ్' నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాటంలో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్న విద్యార్థులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన వరుస పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సభ వేదికగా నాయకులు డిమాండ్ చేశారు. కేంద్రం తీరు మారే వరకు విద్యార్థుల పక్షాన ఈ పోరాటం కొనసాగుతుందని NSUI స్పష్టం చేసింది.

Advertisement
Advertisement