CM Revanth Reddy | ఖైరతాబాద్‌లో దానం నాగేందరే పోటీ చేస్తారు
CM Revanth Reddy | ఖైతరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తెరదించారు. కాంగ్రెస్ నుంచి దానం నాగేందరే( Danam Nagender ) బరిలో ఉంటారని సీఎం తేల్చిచెప్పారు.
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : ఖైతరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠకు సీఎం రేవంత్ రెడ్డి తెరదించారు. కాంగ్రెస్ నుంచి దానం నాగేందరే బరిలో ఉంటారని సీఎం తేల్చిచెప్పారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఏ ఎన్నికలైనా కీలకమే.. చిన్నదైనా పెద్దదైనా ఎన్నికలను సీరియస్‌గానే తీసుకుంటా. ఎన్నికలను క్యాజువల్‌గా తీసుకుంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదు అని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రానిచ్చేది లేదు. రాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణను దోచేశారు. కేసీఆర్ ఎంతో మంది పిల్లల్ని చంపారు. ఆ పాపం కేసీఆర్‌ను వెంటాడుతుంది. కేసీఆర్ పాల్పడిన అరాచకానికి పకృతి శిక్షిస్తుంది. ఆయన రెండోసారి ఓడిపోవడానికి ప్రకృతి తన పని తాను చేస్తుంది. కాళేశ్వరం విషయంలో మెదడు లేకుండా కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు అని రేవంత్ మండిపడ్డారు.
నాకు సమస్య అర్థమైతే.. కచ్చితంగా దాన్ని పరిష్కరిస్తాను
తెలంగాణలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించాను. నాకు సమస్య అర్థమైతే.. కచ్చితంగా దాన్ని పరిష్కరిస్తాను. కాంగ్రెస్ పార్టీలోని అనుబంధ సంస్థల నాయకులకు కీలక పదవులు ఇచ్చామని గుర్తు చేశారు.
నేను కేసీఆర్ కంటే శ్రీమంతున్నీ...
నేను కేసీఆర్ కంటే శ్రీమంతున్నీ... చిన్ననాటి నుంచి ఆర్థికంగా బాగానే ఉన్నాం. నేను ప్లైన్ పేపర్‌ను. ఎవరి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేయలేదు అన్నారు.
కోర్ ఇష్యూ ఉంటే అల్లరి చేసి బయటకు వెళ్తున్నారు...
అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ రాకుండా తప్పించుకుంటుంది. కోర్ ఇష్యూ ఉంటే అల్లరి చేసి బయటకు వెళ్తున్నారు... చర్చకు రావడం లేదు. రాజకీయాలకు, అభివృద్ధికి నేను ఏనాడు లింకు పెట్టను. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారం పని చేస్తాం. కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ఏ అనాలసిస్ జరుగుతుంది. ప్రాజెక్టులను ప్రభుత్వ డబ్బులతో నిర్మించారు. నిపుణుల సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. ఏ ప్రాజెక్టు అయినా సరే నిర్మాణంలో ఉంటే కేంద్రం పరిధిలోకి రాదు. నిర్మాణం పూర్తయి ఆచరణలోనికి వస్తే ఎన్డీఎస్ఏ పరిధిలోకి వస్తుంది అని సీఎం తెలిపారు.
లోన్ ఇవ్వకుండా ఇప్పుడు అడ్డుకుంటున్నారు
కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం వన్ వే పెట్టాం... చివరికి ట్రాఫిక్ సమస్యకు వన్ వే నే పరిష్కారమైంది. బీఆర్ఎస్ చేయలేని పనులను మా ప్రభుత్వం చేస్తుంది. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మేం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిస్తే.. వచ్చి వెంటనే కేటీఆర్ కలుస్తాడు. కేంద్ర ప్రభుత్వ సూచనతోనే మెట్రో ఫేజ్ వన్‌ను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్ అండ్ టీతో ఒప్పందం చేసుకున్నాం. లోన్ కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ క్లియరెన్స్ కూడా చేసింది. లోన్ ఇవ్వకుండా ఇప్పుడు అడ్డుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramchandar Rao | మియాపూర్ భూములు అమ్మేస్తామంటే ఊకోం
అక్టోబర్ 30, 2026

Ponnam Prabhakar | అమిత్ షా యాత్ర మోదీపై వ్యతిరేకతకు సంకేతం కాదా?
అక్టోబర్ 30, 2026

Harish Rao Letter to Uttam Kumar Reddy | మల్లన్న సాగర్ వద్ద అక్రమ బ్లాస్టింగ్ పనులు ఆపండి.. ఉత్తమ్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ
అక్టోబర్ 30, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | మియాపూర్ భూములు అమ్మేస్తామంటే ఊకోం
- ●Ponnam Prabhakar | అమిత్ షా యాత్ర మోదీపై వ్యతిరేకతకు సంకేతం కాదా?
- ●Nora Fatehi | మనీలాండరింగ్ కేసులో నోరా ఫతేహీకి కోర్టు సమన్లు!
- ●Pooja Hegde | ఆగిపోయిందనుకున్న సినిమా సెట్స్‌పైకి - వయసులో ఐదేళ్లు చిన్న హీరోతో పూజా హెగ్డే రొమాన్స్
- ●Harish Rao Letter to Uttam Kumar Reddy | మల్లన్న సాగర్ వద్ద అక్రమ బ్లాస్టింగ్ పనులు ఆపండి.. ఉత్తమ్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ
- ●Future City | జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు!

Ramchandar Rao | మియాపూర్ భూములు అమ్మేస్తామంటే ఊకోం

Ponnam Prabhakar | అమిత్ షా యాత్ర మోదీపై వ్యతిరేకతకు సంకేతం కాదా?

Nora Fatehi | మనీలాండరింగ్ కేసులో నోరా ఫతేహీకి కోర్టు సమన్లు!

Pooja Hegde | ఆగిపోయిందనుకున్న సినిమా సెట్స్‌పైకి - వయసులో ఐదేళ్లు చిన్న హీరోతో పూజా హెగ్డే రొమాన్స్



