Hyderabad | వనస్థలిపురంలో పాల వ్యాపారిపై కత్తితో దాడి
Hyderabad | హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో దారుణం జరిగింది. యాక్టివాపై పాలు తీసుకెళ్తున్నభుజంగరావుపై శివేందర్ సింగ్ కత్తితో దాడి చేశాడు. ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ సమీపంలో దాడి జరిగింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో దారుణం జరిగింది. యాక్టివాపై పాలు తీసుకెళ్తున్నభుజంగరావుపై శివేందర్ సింగ్ కత్తితో దాడి చేశాడు. ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ సమీపంలో దాడి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న భుజంగరావును చికిత్స నిమిత్తం ఎల్బీనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గుర్రంగూడలో భుజంగరావు ఇంటి పక్కనే శివేందర్‌సింగ్ ఉంటున్నాడు. ఎన్జీవోస్ కాలనీలో భుజంగరావు పాల వ్యాపారం చేస్తుండగా, శివేందర్‌సింగ్ స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో భుజంగరావుపై దాడి చేసిన శివేందర్‌సింగ్, అనంతరం వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Cyberabad Police | మధ్యాహ్నం 2 గంటలకే లాగౌట్ అవ్వండి..
- ●Vemulawada | వేములవాడ రాజన్నకు భారీగా ఆదాయం..
- ●KCR Farm House | కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు..!
- ●Road Accident | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ●Youtuber Haribabu | యూట్యూబర్ హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం..
- ●Python | దుర్గం చెరువు @ ఐటీ కంపెనీ ముందు కొండ చిలువ ప్రత్యక్షం

Cyberabad Police | మధ్యాహ్నం 2 గంటలకే లాగౌట్ అవ్వండి..

Vemulawada | వేములవాడ రాజన్నకు భారీగా ఆదాయం..

KCR Farm House | కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు..!

Road Accident | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి





