త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Young man’s suicide | ప్రియురాలి వ‌ల్లే చ‌నిపోతున్నా.. స్టీల్ బ్రిడ్జి పైనుంచి దూకిన యువ‌కుడు

Young man’s suicide | హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని వీఎస్‌టీ స్టీల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువ‌కుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

S

Flash news | Published On Sep 18, 2026, 12.56 pm IST

Young man’s suicide | ప్రియురాలి వ‌ల్లే చ‌నిపోతున్నా.. స్టీల్ బ్రిడ్జి పైనుంచి దూకిన యువ‌కుడు
Advertisement

Young man’s suicide | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని వీఎస్‌టీ స్టీల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువ‌కుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. మృతుడు రాంన‌గ‌ర్ పార్సీగుట్ట‌కు చెందిన మ‌నోజ్‌గా గుర్తించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. స‌ద‌రు యువకుడు శివం రోడ్డులోని అపోలో డయాగ్నొస్టిక్‌లో పని చేస్తున్నట్లు తెలిపారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌నోజ్ శుక్ర‌వారం ఉద‌యం త‌న బైక్‌పై వ‌చ్చి స్టీల్ బ్రిడ్జిపై నిలిపాడు. ఆ వెంట‌నే ఫ్లైఓవ‌ర్ నుంచి కింద‌కు దూకాడు. రోడ్డుపై ప‌డ‌డంతో తీవ్ర గాయాల‌పాలై అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుడి బైక్‌పై ఓ మొబైల్‌ ఫోన్‌ లభించిందని, అందులో సూసైడ్‌ నోట్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆ నోట్‌లో తాను ఎలాంటి అప్పుల్లో లేనని, తాను ప్రేమించిన ఓ యువతి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యువకుడు పేర్కొన్నట్లు చెప్పారు. అయితే ఆ నోట్‌లోని విషయాలను పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్న‌ట్లు పోలీసులు వివ‌రించారు. ఈ ఘటనతో ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ పరిసరాల్లో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డడంతో పోలీసులు చ‌క్క‌దిద్దారు. ద‌ర్యాప్తు అనంత‌రం పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement