త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchander Rao | కార్గిల్ విజ‌య్ దివ‌స్‌.. సైనికుల అస‌మాన ప‌రాక్ర‌మానికి ప్ర‌తీక‌: ఎన్‌. రామ‌చంద‌ర్ రావు

Ramchander Rao | భార‌తదేశ‌ సైన్యం ధైర్యానికి, అస‌మాన ప‌రాక్ర‌మానికి, చెక్కుచెద‌ర‌ని సంక‌ల్పానికి, దేశంపై అత్యున్న‌త అంత‌కిత‌భావానికి ప్ర‌తీక కార్గిల్ విజ‌య్ దివ‌స్ అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌. రామ‌చంద‌ర్ రావు (Ramchander Rao) అన్నారు.

G

Hyderabad | Published On Jul 26, 2026, 4.28 pm IST

Ramchander Rao | కార్గిల్ విజ‌య్ దివ‌స్‌.. సైనికుల అస‌మాన ప‌రాక్ర‌మానికి ప్ర‌తీక‌: ఎన్‌. రామ‌చంద‌ర్ రావు
Advertisement

Ramchander Rao | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌తదేశ‌ సైన్యం ధైర్యానికి, అస‌మాన ప‌రాక్ర‌మానికి, చెక్కుచెద‌ర‌ని సంక‌ల్పానికి, దేశంపై అత్యున్న‌త అంత‌కిత‌భావానికి ప్ర‌తీక కార్గిల్ విజ‌య్ దివ‌స్ అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌. రామ‌చంద‌ర్ రావు (Ramchander Rao) అన్నారు. కార్గిల్‌లోని (Kargil Vijay Diwas) దుర్భేద్యమైన శిఖరాలపై వీర జవాన్లు అసాధారణ శౌర్యాన్ని ప్రదర్శించి త్రివర్ణ పతాక గౌరవాన్ని, దేశ ప్రతిష్ఠను కాపాడుతూ సువర్ణాధ్యాయాన్ని లిఖించార‌ని చెప్పారు. విజ‌య్ దివస్ సంద‌ర్భంగా సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లోని అమ‌రుల స్థూపానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం మాట్లాడుతూ.. దేశ సరిహద్దులను అహర్నిశలు కాపాడుతున్న మన వీర సైనికులందరికీ శిరస్సు వంచి వందనం చేస్తున్నాని చెప్పారు. మన వీరపుత్రుల త్యాగం, అమరత్వం, దేశం పట్ల వారి అపూర్వ అంకితభావం ప్రతి భారతీయుడిలో, ముఖ్యంగా యువతలో దేశభక్తిని, జాతీయ సేవాభావాన్ని తరతరాలకు ప్రేరేపిస్తూనే ఉంటాయ‌ని వెల్ల‌డించారు.

అనంత‌రం నారాయణగూడలోని కేఎంఐటీలో నిర్వహించిన ధన్వంతరి అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న హైద‌రాబాద్‌కు చెందిన ప‌లువురు వైద్యుల‌కు అవార్డులు ప్ర‌దానం చేశారు. గత 12 సంవత్సరాలుగా ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేసిందన్నారు. నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, వైద్య ఖర్చులను తగ్గించి, ప్రజాకేంద్రీకృత ఆరోగ్య వ్యవస్థ నిర్మాణానికి కృషి చేస్తున్న‌ద‌ని తెలిపారు. సంస్కరణల ఫలితాలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు.

Advertisement
Advertisement