Health Tax | జంక్‌ఫుడ్‌పై హెల్త్ ట్యాక్స్!
Health Tax | చిప్స్, పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాకేజ్డ్ స్నాక్స్ సహా శీతల పానీయాలు చిన్నారుల ఆరోగ్యానికి శాపంగా మారుతున్నాయి. దేశంలో 5–19 ఏళ్ల వయసున్న 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నట్లు ఐసీఎంఆర్ పరిధిలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) నివేదిక వెల్లడించింది. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఏదో ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపింది.
- కేంద్రానికి సిఫారసు చేసిన ఎన్ఐఎన్
- పిల్లల ఆరోగ్యానికి పెనుముప్పుగా చిప్స్, పిజ్జాబర్గర్లు, కూల్‌డ్రింక్స్
- ప్రతి ముగ్గురి పిల్లల్లో ఒకరికి ఆరోగ్య సమస్య
- 4.1కోట్ల మందిలో ఊబకాయం
Health Tax | చిప్స్, పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాకేజ్డ్ స్నాక్స్ సహా శీతల పానీయాలు చిన్నారుల ఆరోగ్యానికి శాపంగా మారుతున్నాయి. దేశంలో 5–19 ఏళ్ల వయసున్న 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నట్లు ఐసీఎంఆర్ పరిధిలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) నివేదిక వెల్లడించింది. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఏదో ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపింది. పిల్లల్లో 10 శాతం మంది ప్రీ-డయాబెటిస్ దశలో ఉండగా.. ఒక శాతం మంది కౌమార దశలోనే మధుమేహం బారిన పడుతున్నారు. మరో 5 శాతం మందికి అధిక రక్తపోటు ఉన్నట్లు పేర్కొంది. ఇలాంటి పరిస్థితులను నియంత్రించేందుకు అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండే ఆహార పదార్థాలు, షుగర్ డ్రింక్స్‌పై హెల్త్ ట్యాక్స్ లేదంటే ప్రస్తుతం ఉన్న పన్నులను పెంచే ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది.
హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్ ఆహారంతో ముప్పు
అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన ఆహారాలను హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్ (హై ఫ్యాట్, హై షుగర్, హై సాల్ట్) ఆహారాలుగా పిలుస్తారు. వీటిలో పోషక విలువలు తక్కువగా, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ట్రాన్స్‌ఫ్యాట్స్, శుద్ధి చేసిన పిండి, కృత్రిమ రుచులు వంటి పదార్థాలు ఉండడంతో వీటిని తరచూ తీసుకోవడం వల్ల చిన్నారుల్లో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతున్నాయని నివేదిక హెచ్చరించింది. దేశంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్ వేగంగా విస్తరించింది. 2006లో 0.9 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్.. 2019 నాటికి 37.9 బిలియన్ డాలర్లకు చేరింది. 2009 నుంచి 2023 మధ్య ఇటువంటి ఉత్పత్తుల అమ్మకాలు దాదాపు 150 శాతం పెరిగాయి. ఆకర్షణీయమైన ప్రకటనలే ఇందుకు ప్రధాన కారణమని ఎన్‌ఐఎన్ పేర్కొంది. అయితే, టీవీలు, మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, క్రికెట్ మ్యాచ్‌లు, పాఠశాలల పరిసరాల్లో జంక్‌ఫుడ్ ప్రకటనలు చిన్నారులను ప్రభావితం చేస్తున్నాయి. పిల్లల టీవీ ఛానళ్లలో వచ్చే ప్రకటనల్లో దాదాపు 90 శాతం అనారోగ్యకర ఆహార ఉత్పత్తులవేనని నివేదిక తెలిపింది. పాఠశాలలు, కళాశాలల చుట్టూ ఇటువంటి ఆహారం సులభంగా లభిస్తోందని 92.6 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
పలుదేశాల్లో ఆంక్షలు
జంక్‌ఫుడ్ నియంత్రణలో కొన్ని దేశాలు కఠిన చర్యలు చేపట్టాయి. చిలీలో షుగర్ డ్రింక్స్‌పై ఆంక్షలు విధించారు. నిబంధనలు అమలు చేసిన తర్వాత వాటి వినియోగం 20–30 శాతం తగ్గింది. దక్షిణ కొరియాలో పిల్లలను లక్ష్యంగా చేసుకున్న టీవీ ప్రకటనలు 81 శాతం తగ్గగా.. బ్రిటన్‌లో చిన్నారులకు సంబంధించిన ఇలాంటి ప్రకటనల ప్రసారం 37 శాతం తగ్గింది. నార్వే 2026 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలను లక్ష్యంగా చేసుకునే డిజిటల్ జంక్‌ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించనుంది. జంక్‌ఫుడ్ ప్యాకెట్లపై చక్కెర, కొవ్వు, ఉప్పు శాతం స్పష్టంగా కనిపించేలా ముందుభాగంలోనే హెచ్చరికలు ముద్రించాలని ఎన్‌ఐఎన్ సూచించింది. పాఠశాలలు, వాటి పరిసరాల్లో ఇటువంటి ఆహార పదార్థాల విక్రయాలను నియంత్రించాలని పేర్కొంది. అయితే, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు కుటుంబాలు, పాఠశాలలు, ప్రభుత్వం సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్‌ఐఎన్ నివేదిక స్పష్టం చేసింది.
ఏం తెంటే.. ఏమవుతుంది?
చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్: అధిక రక్తపోటు, ఊబకాయం
బర్గర్, పిజ్జా: ఊబకాయం, గుండె జబ్బులు
శీతల పానీయాలు: మధుమేహం, ఫ్యాటీ లివర్
కేకులు, పేస్ట్రీలు: ఊబకాయం, బ్లడ్‌లో హై షుగర్
టాఫీలు, చాక్లెట్లు: దంత సమస్యలు, ఊబకాయం
ఇన్‌స్టంట్ నూడుల్స్: అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
సెప్టెంబర్ 22, 2026

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
సెప్టెంబర్ 22, 2026

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Mercedes Benz Cars | భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బెంజ్ కార్లు
- ●Hero Motors | మూడు ఐపీఓల లిస్టింగ్.. ఎవరి షేర్ ఎంత లాభం ఇచ్చిందంటే?
- ●Bank Employees Strike | ఈ నెల 28 నుంచి మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఉద్యోగుల సమ్మె సైరన్ ఎందుకు? వాళ్ల డిమాండ్స్ ఏంటి?
- ●Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘటన.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న లేడీ శ్రీరామ్ కళాశాల
- ●Anthropic | ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఓపస్ 5.5.. గత మోడల్స్ కన్నా 40 శాతం తక్కువ ఖర్చు..
- ●Election Commission | సర్‌పై ఈసీలో అంతర్గత విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు

Mercedes Benz Cars | భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బెంజ్ కార్లు

Hero Motors | మూడు ఐపీఓల లిస్టింగ్.. ఎవరి షేర్ ఎంత లాభం ఇచ్చిందంటే?

Bank Employees Strike | ఈ నెల 28 నుంచి మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఉద్యోగుల సమ్మె సైరన్ ఎందుకు? వాళ్ల డిమాండ్స్ ఏంటి?

Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘటన.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న లేడీ శ్రీరామ్ కళాశాల



