త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష‌

POCSO Case | చ‌లి మంట‌లు వేసుకుందామ‌ని బాలుడిని ర‌హ‌స్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డ ఘ‌ట‌న‌లో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది ప్ర‌త్యేక కోర్టు.

S

Hyderabad | Published On Nov 6, 2026, 1.04 pm IST

POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష‌
Advertisement

POCSO Case | త్రినేత్ర న్యూస్ : చ‌లి మంట‌లు వేసుకుందామ‌ని బాలుడిని ర‌హ‌స్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డ ఘ‌ట‌న‌లో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది ప్ర‌త్యేక కోర్టు. జైలు శిక్ష‌తో పాటు రూ. 6,500 జ‌రిమానా విధించింది. ఇక బాధితుడి కుటుంబానికి రూ. 3 ల‌క్ష‌లు ప‌రిహారం ఇవ్వాల‌ని ఆదేశించింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కానాజిగూడ అంబేద్క‌ర్ న‌గ‌ర్‌కు చెందిన ఎటికెల రాజ‌శేఖ‌ర్‌(27).. 2019 డిసెంబ‌ర్ 15న రాత్రి ఓ 10 ఏండ్ల బాలుడిని చ‌లి మంట‌లు వేసుకుందామ‌ని ర‌హ‌స్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్క‌డికి తీసుకెళ్లి అత‌నిపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. దాంతో బాలుడి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింది. అనారోగ్యానికి గుర‌య్యాడు. చివ‌ర‌కు విష‌యం త‌ల్లిదండ్రుల‌కు చెప్పాడు. రాజ‌శేఖ‌ర్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కోర్టులో విచార‌ణ అనంత‌రం గురువారం తుది తీర్పు వెలువ‌డింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Advertisement
Advertisement