త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POCSO Case | మదర్సాలో బాలుడిపై లైంగిక వేధింపులు.. నిందితుడు ఎలా వేధించాడంటే!

POCSO Case | హైద‌రాబాద్‌లోని పాత‌బ‌స్తీ మధ‌న్నపేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ ప్ర‌బుద్ధుడు బాలుడిపై లైంగిక వేధింపుల‌ (Sexual harassment)కు పాల్ప‌డిన ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది.

S

Telangana | Published On Nov 5, 2026, 3.50 pm IST

POCSO Case | మదర్సాలో బాలుడిపై లైంగిక వేధింపులు.. నిందితుడు ఎలా వేధించాడంటే!
Advertisement

POCSO Case | త్రినేత్ర న్యూస్: హైద‌రాబాద్‌లోని పాత‌బ‌స్తీ మధ‌న్నపేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ ప్ర‌బుద్ధుడు బాలుడిపై లైంగిక వేధింపుల‌ (Sexual harassment)కు పాల్ప‌డిన ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. అశ్లీల వీడియోలు చూపించి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు బాలుడి త‌ల్లి ఆరోపించింది. అంత‌టితో ఆగ‌కుండా విష‌యం బ‌య‌ట‌కు చెప్పొందంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడంటూ గురువారం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. త‌ల్లి ఫిర్యాదులో ఏముందంటే..

11 ఏళ్ల బాలుడు కుర్మగూడ ఫాతిమా మసీదు మదర్సా (Madrasa)లో చ‌దువుతున్నాడు. స‌ద‌రు బాలుడికి అరబిక్ బోధించే మౌల్సాబ్ త‌న మొబైల్‌లో అశ్లీల వీడియోలు చూపించి లైంగికంగా వేధించాడు. విషయం బయటకు చెప్పవద్దంటూ బెదిరించాడు.. అని బాలుడి త‌ల్లి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఈ మేర‌కు నిందితుడిపై BNS, పోక్సో చట్టం కింద కేసు (POCSO Case) నమోదు చేసిన పోలీసులు బాలుడి వాంగ్మూలం కోసం భరోసా కేంద్రానికి పంపించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

బాలల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. పిల్లలపై ఎలాంటి అనుమానాస్పద ప్రవర్తన కనిపించినా తల్లిదండ్రులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాల‌ని సూచించారు.

Advertisement
Advertisement