త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murder Attempt | కారుతో ఢీకొట్టి.. హైద‌రాబాద్‌లో న్యాయ‌వాదిపై హ‌త్యాయ‌త్నం..

Murder Attempt | హైద‌రాబాద్‌లో (Hyderabad) రోజురోజుకు శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణిస్తున్నారు. ప‌ట్ట‌ప‌గ‌లే నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఓవైపు తాము ప‌నిచేస్తున్న ఇండ్ల‌లోనే నేపాలీ ముఠ దోపిడీల‌కు పాల్ప‌డుతుండ‌గా, మ‌రోవైపు దుండ‌గులు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను అంత‌మొందిస్తున్నారు.

G

Hyderabad | Published On May 23, 2026, 11.58 am IST

Murder Attempt | కారుతో ఢీకొట్టి.. హైద‌రాబాద్‌లో న్యాయ‌వాదిపై హ‌త్యాయ‌త్నం..
Advertisement

Murder Attempt | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో (Hyderabad) రోజురోజుకు శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణిస్తున్నారు. ప‌ట్ట‌ప‌గ‌లే నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఓవైపు తాము ప‌నిచేస్తున్న ఇండ్ల‌లోనే నేపాలీ ముఠ దోపిడీల‌కు పాల్ప‌డుతుండ‌గా, మ‌రోవైపు దుండ‌గులు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను అంత‌మొందిస్తున్నారు. ఇక ఆన్‌లైన్ మోసాలు, దాడులు, ప్ర‌తిదాడుల‌కు అంతేలేకుండా పోతున్న‌ది. తాజాగా అంతా చూస్తుండ‌గానే న‌గ‌రం న‌డిఒడ్డును ఓ న్యాయ‌వాదిపై (Lawyer) హ‌త్యాయ‌త్నం (Murder Attempt) జ‌రిగింది. కారుతో గుద్ది చంపాల‌ని చూశారు. ఈ ఘ‌ట‌న మాస‌బ్ ట్యాంక్ ప్రాంతంలో చోటుచేసుకున్న‌ది.

ఖాజా మొహినుద్దీన్ అనే న్యాయ‌వాది మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. శ‌నివారం ఉద‌యం త‌న ఇంటి నుంచి బయటకు వచ్చిన అత‌డిని దుండగులు కారుతో బలంగా ఢీకొట్టారు. పక్కా ప్లాన్‌తో న్యాయవాది కోసం వేచి చూస్తున్న గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు.. మొహియుద్దీన్ బయటకు వచ్చిన వెంటనే అత్యంత వేగంగా వచ్చి కారుతో ఢీకొట్టి పరారయ్యారు. దీంతో ఆయ‌న గాలిలోకి అంతెత్తు ఎగిరి కింద‌ప‌డిపోయారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న‌ను కుటుంబసభ్యులు హుటాహుటిన ద‌వాఖాన‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

కాగా, లాయ‌ర్ మొహినుద్దీన్‌పై దాడి విష‌యం తెలుసుకున్న తోటి న్యాయ‌వాదులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది న్యాయ‌వ్య‌వ‌స్థ‌పైనే దాడిగా పేర్కొన్నారు. దుండగుల‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. కారు నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Advertisement