త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain | ఉరుములు, మెరుపుల‌తో రాత్రి దంచికొట్టిన వాన‌

Rain | శుక్ర‌వారం ఉద‌యం నుంచి ఎండ దంచికొట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఉక్క‌పోత‌తో అల్లాడిపోతున్న న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మాత్రం రాత్రి ఏడెనిమిది గంట‌ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్లైంది.

S

Hyderabad | Published On Mar 28, 2026, 6.59 am IST

Rain | ఉరుములు, మెరుపుల‌తో రాత్రి దంచికొట్టిన వాన‌
Advertisement

Rain | త్రినేత్ర‌.న్యూస్ : శుక్ర‌వారం ఉద‌యం నుంచి ఎండ దంచికొట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఉక్క‌పోత‌తో అల్లాడిపోతున్న న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మాత్రం రాత్రి ఏడెనిమిది గంట‌ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్లైంది. ఎందుకంటే ఉన్న‌ట్టుండి ఉరుములు మెరుపుల‌తో పాటు ఈదురుగాలుల‌తో కూడిన వాన కురిసింది. మోస్త‌రు వ‌ర్షం కురిసిన‌ప్ప‌టికీ ఈదురు గాలులు బ‌లంగా వీచాయి. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచ‌డంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. ప‌లు చోట్ల చెట్లు నేల‌కొరిగాయి.

అబ్దుల్లాపూర్‌మెట్, నాగారం, ఈసీఐఎల్, కాప్రా, కీసర, మేడ్చల్, మలక్‌పేట, ముషీరాబాద్‌ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. మ‌ల్కాజ్‌గిరిలో అత్య‌ధికంగా 11.5 మి.మీ., స‌ఫిల్‌గూడ‌లో 11.0, కుత్బుల్లాపూర్‌లో 10.5, బాలాన‌గ‌ర్‌లో 10.5, మారేడుప‌ల్లిలో 9.8, హ‌య‌త్‌న‌గ‌ర్‌లో 9.5 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement