Weather | హైదరాబాద్‌లో విచిత్ర వాతావరణం..!
Weather | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పొద్దునంతా పొగ మంచు, మధ్యాహ్నం సమయానికి కాస్త ఎండ, రాత్రి పూట పూర్తిగా వాతావరణం చల్లబడి పోతోంది.
Weather | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పొద్దునంతా పొగ మంచు, మధ్యాహ్నం సమయానికి కాస్త ఎండ, రాత్రి పూట పూర్తిగా వాతావరణం చల్లబడి పోతోంది. అంతేకాదు ఎండలోనూ చల్లని గాలులు వీస్తుండడంతో హైదరాబాద్ వాసులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్‌తో పాటు సమీప జిల్లాల్లో పగటి, రాత్రి పూట ఉష్ణోగ్రతలకు వ్యత్యాసం ఉంది. 15 డిగ్రీల సెల్సియస్ తేడాతో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ వాతావరణ పరిస్థితిలు జనవరి 28 వరకు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పగటి పూట 29 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, రాత్రి వేళ 16 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య 14 నుంచి 15 డిగ్రీల వ్యత్యాసం ఉంది.
ఫిబ్రవరి రెండో వారం వరకు తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందన్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఇక సాయంత్రం పూట చల్లని గాలులు వీస్తుండడంతో నగర ప్రజలు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే.. కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



