త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DSC Notification | 15 వేల పోస్టుల‌తో డీఎస్సీ నోటిఫికేష‌న్ జారీ చేయండి.. నిరుద్యోగుల డిమాండ్

DSC Notification | రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఆందోళ‌న కొన‌సాగుతూనే ఉంది. మొన్న‌టి వ‌ర‌కు కానిస్టేబుల్ అభ్య‌ర్థుల ఆందోళ‌న‌ల‌తో తెలంగాణ అట్టుడుకుగా, తాజాగా డీఎస్సీ అభ్య‌ర్థుల ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి.

S

Telangana | Published On Jul 14, 2026, 4.19 pm IST

DSC Notification | 15 వేల పోస్టుల‌తో డీఎస్సీ నోటిఫికేష‌న్ జారీ చేయండి.. నిరుద్యోగుల డిమాండ్
Advertisement

DSC Notification | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఆందోళ‌న కొన‌సాగుతూనే ఉంది. మొన్న‌టి వ‌ర‌కు కానిస్టేబుల్ అభ్య‌ర్థుల ఆందోళ‌న‌ల‌తో తెలంగాణ అట్టుడుకుగా, తాజాగా డీఎస్సీ అభ్య‌ర్థుల ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15 వేల టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు త‌క్ష‌ణ‌మే డీఎస్సీ నోటిఫికేష‌న్ జారీ చేయాల‌ని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్య‌ర్థులు సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు.

ఈ సంద‌ర్భంగా అభ్య‌ర్థులు మీడియాతో మాట్లాడుతూ.. గత డీఎస్సీ సమయంలో అతి త్వరలోనే మరో డీఎస్సీ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ పదే పదే టెట్ పరీక్షలు నిర్వహిస్తూ డీఎస్సీపై కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్త్రంలో అన్ని టెట్ పరీక్షలు కలిపి ఇప్పటికే 95 శాతానికి పైగా అభ్యర్థులు టెట్‌లో అర్హత సాధించారు. కాబ‌ట్టి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, మోడల్ స్కూల్స్‌లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థులు హరీష్, కల్యాణ్, వెంకటేష్, పాండు, సాయి, అరవింద్, సందీప్ శ్రీలత, సుక‌న్య‌, సంధ్యారాణి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement