త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Imtiaz | పాత‌బ‌స్తీ ప్ర‌జ‌ల‌ను రేవంత్ అవ‌మానిస్తుండు.. ఎంఐఎం ఢోకా చేస్తుంది

Imtiaz | పాతబ‌స్తీ ప్ర‌జ‌ల‌ను సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అవ‌మానిస్తున్నార‌ని.. ఎంఐఎం (MIM) కూడా ఢోకా చేస్తుంద‌ని కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ ఇంతియాజ్ (Imtiaz) ఆరోపించారు.

S

Telangana | Published On Nov 14, 2026, 3.09 pm IST

Imtiaz | పాత‌బ‌స్తీ ప్ర‌జ‌ల‌ను రేవంత్ అవ‌మానిస్తుండు.. ఎంఐఎం ఢోకా చేస్తుంది
Advertisement
  • విద్యా దినోత్స‌వంనాడు అడ్డ‌దొడ్డం మాట్లాడి పోయిండు
  • మైనారిటీల‌కు అజారుద్దీన్ ఏం చేశాడో చెప్పాలి
  • కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ ఇంతియాజ్ విమ‌ర్శలు

Imtiaz | త్రినేత్ర న్యూస్‌: పాతబ‌స్తీ ప్ర‌జ‌ల‌ను సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అవ‌మానిస్తున్నార‌ని.. ఎంఐఎం (MIM) కూడా ఢోకా చేస్తుంద‌ని కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ ఇంతియాజ్ (Imtiaz) ఆరోపించారు. విద్యా దినోత్స‌వం రోజు విద్యార్థుల కోసం మాట్లాడుత‌డనుకుంటే అడ్డ‌దొడ్డం మాట్లాడి పోయిండ‌ని విమ‌ర్శించారు. మూడు సంవత్సరాల కాలంలో అజారుద్దీన్ మైనారిటీల‌కు ఏం చేశారో స‌మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమేర‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో శనివారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రేవంత్‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

యంగ్ ఇండియా స్కూల్స్‌లో క‌లిపే కుట్ర న‌డుస్తుంది

మైనారిటీ డిక్లరేషన్ చేసి ఒక్క మాట మాట్లాడడం లేదు. మైనారిటీలకు ఒక్క కొత్త గురుకుల స్కూల్ పెట్టలేదు. నాడు ఉన్న 204 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. మైనారిటీల‌కు ఏం ఉపయోగం లేని వ్యక్తిని మంత్రిని చేశాడు. యంగ్ ఇండియా స్కూల్స్‌లో మైనారిటీ స్కూల్స్ ను కలిపే కుట్ర నడుస్తోంది. యాంగ్ ఇండియా స్కూల్స్ పెట్టుకో మైనార్టీ స్కూల్స్ ను కలపవద్దు...కలిపితే ఉద్యమం తప్పదు. యంగ్ ఇండియా స్కూల్స్ వల్ల చాలా సమస్యలు వస్తాయి.

బీజేపీతో ఉన్న బాబు శిష్యుడివి నువ్..

నీవు ఏబీవీపీ అని చెప్పి సెక్యులర్ ఎలా అంటావు? కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. మైనారిటీలు అంటే నీకు చిత్తశుద్ధి లేదు. నీవు చంద్రబాబు శిష్యుడివి. ఆయన బీజేపీతో కలిసి ఉన్నాడు. నీ ప్రభుత్వం వచ్చాక 50 గొడవలు జరిగాయి. టేమ్రిస్ స్కూల్స్ ను యంగ్ ఇండియా స్కూల్స్ లో కలిపితే ద్రోహిగా మిగిలిపోతావు అని ఇంతియాజ్‌ ఫైర‌య్యారు.

హ‌జ్ యాత్రికుల ఆర్థిక సాయం ఏది? మాసిఉల్లా ఖాన్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్

ఇమామ్ లకు పది వేలు ఇస్తామ‌న్నారు.. ఏమైంది? హ‌జ్ యాత్ర చేసేవారికి ఆర్థిక సహాయం ఏమైంది? నాడు కేసీఆర్ ఉన్నప్పుడు హజ్ యాత్రికులకు అన్ని వసతులు కల్పించేవారు. ముస్లింలకు ఖబ్రస్తాన్‌ల‌కు భూములు కేటాయించారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసులు ఉన్నాయని తప్పించుకుంటోంది. వక్ఫ్ బోర్డు భూములు కాపాడడంలో ప్రభుత్వం విఫల‌మైంది. హజ్ భవన్ కు వెళ్ళాలి అంటే గేట్ మూసివేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖబ్రస్తాన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.. ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను మోసం చేసింది.

హైద‌రాబాద్ డ్ర‌గ్స్‌కు అడ్డా అయంది: ఆజం అలీ, బీఆర్ఎస్ మలక్‌పేట ఇంచార్జి

ముస్లింలను కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అంటుంది. కానీ ఎక్కడ అలా పని చేయడం లేదు. మైనారిటీ నాయకుడు మహమూద్ అలీని కేసీఆర్ డిప్యూటీ సీఎం చేశారు. కేసీఆర్ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకం అమలు చేశారు. హైద‌రాబాద్ అభివృద్ధి చేశాం అంటున్నాడు.. ఇప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారింది. కొడంగల్‌లో మసీదును కూల్చారు. ఇదేనా ముస్లింలకు మీరిచ్చే గౌరవం. కాంగ్రెస్ పార్టీ ఢోకా చేస్తుంది.

Advertisement
Advertisement