త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ORR | ఓఆర్ఆర్‌పై 200 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన కారు.. యువ‌కుడు అరెస్ట్‌

ORR | అస‌లే అది ఏ అడ్డంకులు లేకుండా ఉండే ర‌హ‌దారి. గ‌తుకులు, గుంతలు అస‌లే క‌నిపించ‌వు. ట్రాఫిక్ కూడా త‌క్కువే. ఇంకేముంది మ‌న‌సు ఉరికే ఉంటుందా. గాలితో పోటీ అన్న‌ట్లు మ‌న వాహ‌న‌మూ దూసుకెళ్తుంది.

G

Hyderabad | Published On May 25, 2026, 12.12 pm IST

ORR | ఓఆర్ఆర్‌పై 200 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన కారు.. యువ‌కుడు అరెస్ట్‌
Advertisement

ORR | త్రినేత్ర‌.న్యూస్‌: అస‌లే అది ఏ అడ్డంకులు లేకుండా ఉండే ర‌హ‌దారి. గ‌తుకులు, గుంతలు అస‌లే క‌నిపించ‌వు. ట్రాఫిక్ కూడా త‌క్కువే. ఇంకేముంది మ‌న‌సు ఉరికే ఉంటుందా. గాలితో పోటీ అన్న‌ట్లు మ‌న వాహ‌న‌మూ దూసుకెళ్తుంది. ఓఆర్ఆర్‌పై (ORR) కూడా అదే జ‌రిగింది. ఏకంగా 200 కిలోమీట‌ర్ల వేగంతో కారు ప‌రుగులు పెట్టింది. స‌ర‌దా తీరేలోపు పోలీసులు వ‌చ్చి డ్రైవ‌ర్‌ను ప‌ట్టుకున్నారు. కారును సీజ్ చేశారు.

అల‌కాపురి టౌన్‌షిప్‌కు చెందిన కొత్త‌ప‌ల్లి య‌శ్వంత్ రెడ్డి గ‌త నెల‌లో వోక్స్ వ్యాగ‌న్ విర్ట‌స్ కారును కొనుగోలు చేశారు. దాని వేగాన్ని ప‌రీక్షించేందుకు ఈ నెల 10న నార్సింగి టోల్‌గేట్ వ‌ద్ద ఓఆర్ఆర్ ఎక్కారు. కారును 200 కిలోమీట‌ర్ల వేగంతో ఉరికించాడు. దాన్ని వీడియో తీసి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అదికాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆదివారం అత‌డిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్‌, ప్ర‌మాద‌క‌ర స్టంట్లు చేయ‌డం, దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తామ‌ని అధికారులు చెప్పారు. కాగా, కారు స్పీడ్‌ను ప‌రిశీలించేందుకే తాను అలా చేశాన‌ని య‌శ్వంత్ రెడ్డి చెప్పారు.

Advertisement
Advertisement