త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malla Reddy | ఎన్నికల ప్రచారంలో స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన‌ మాజీ మంత్రి మల్లారెడ్డి

Malla Reddy | మున్సిపల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాజీ మంత్రి, మేడ్చ‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి (Malla Reddy) దూసుకుపోతున్నారు. త‌న‌దైన శైలిలో స్పీచ్‌లు ఇస్తూ, కార్య‌క‌ర్త‌ల‌తో స్టెప్పులేస్తూ ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు.

G

Hyderabad | Published On Jan 29, 2026, 1.07 pm IST

Malla Reddy | ఎన్నికల ప్రచారంలో స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన‌ మాజీ మంత్రి మల్లారెడ్డి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మున్సిపల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాజీ మంత్రి, మేడ్చ‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి (Malla Reddy) దూసుకుపోతున్నారు. త‌న‌దైన శైలిలో స్పీచ్‌లు ఇస్తూ, కార్య‌క‌ర్త‌ల‌తో స్టెప్పులేస్తూ ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు. ర్యాలీలు, కార్న‌ర్ మీటింగుల్లో పాల్గొంటూ బీఆర్ఎస్ (BRS) అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని కోరుతున్నారు.

ఇందులో భాగంగా మేడ్చ‌ల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి రాజబొల్లారం తండాలో నిర్వ‌హించిన ఎన్నికల ప్రచారంలో మ‌ల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేశారు. గులాబీ కండువా చేత‌ప‌ట్టుకుని బీట్‌కు త‌గ్గ‌ట్టుగా ఊపుతూ, హుషారుగా స్టెప్పులేస్తూ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపారు. బీఆర్ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ గెలిపించి కాంగ్రెస్ పార్టీకి దిమ్మ‌తిరిగేలా జ‌వాబివ్వాల‌న్నారు.

https://x.com/TeluguStride/status/2016758413171335605?s=20

 

Advertisement

తాజావార్తలు

Advertisement