Congress Cadre Protest | గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల ధర్నా.. చేవెళ్ల ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం
Congress Cadre Protest | హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో చేవెళ్ల కాంగ్రెస్ నేతలు శుక్రవారం నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న తమకు కాకుండా, ఇటీవల పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
Congress Cadre Protest | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో చేవెళ్ల కాంగ్రెస్ నేతలు శుక్రవారం నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న తమకు కాకుండా, ఇటీవల పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. పాత కార్యకర్తలను కలుపుకుని పోకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలె యాదయ్య డౌన్ డౌన్, కాలె యాదయ్య హఠావో కాంగ్రెస్ పార్టీకో బచావో అంటూ నినదించారు.
కార్యకర్తలు మాట్లాడుతూ.. కాలె యాదయ్య ఏ పార్టీలో ఉన్నాడో చెప్పడం లేదన్నారు. కనీసం కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి పార్టీని నమ్ముకొని పని చేస్తున్న తమకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని వాపోయారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని పోకుండా ఇష్టారీతిన వ్యహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ యాదయ్య జోక్యం చేసుకోకూడదని డిమాండ్ చేశారు. అన్ని పదవులను బీఆర్ఎస్ నేతలకే ఇస్తున్నారంటూ ఆరోపించారు. అయితే ఈ నిరసనతో నియోజకవర్గంలో నేతల మధ్య నెలకొన్న విభేదాలను మరోసారి బయటపడినట్లయింది.
గాంధీ భవన్‌లో చేవెళ్ళ కాంగ్రెస్ నేతల నిరసన
కాలే యాదయ్య డౌన్ డౌన్ అంటూ.. అసంతృప్తి వ్యక్తం చేసిన నాయకులు
పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ యాదయ్య జోక్యం చేసుకోకూడదని డిమాండ్
అన్ని పదవులను కాలే యాదయ్య బీఆర్ఎస్ నేతలకే ఇస్తున్నారంటూ మండిపాటు pic.twitter.com/LtWU9iw7X7
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 3, 2026
కాలె యాదయ్యకు హటావో కాంగ్రెస్ పార్టీకో బచావో
గాంధీ భవన్ ఎదుట నిరసనకు దిగిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు
కాలె యాదయ్య ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పకుండా, కనీసం కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోవడం లేదని కార్యకర్తల ఆందోళన pic.twitter.com/ItxGHx4Uty
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2026
తాజావార్తలు
- ●Telangana Agriculture | తెలంగాణలో 10.20 లక్షల ఎకరాలకు తగ్గిన సాగు.. మరి వరి సాగు ఎంతో తెలుసా..?
- ●Vinod Kumar | పిచ్చి పిచ్చి సవాళ్లెందుకు.. ఫస్ట్ మేడిగడ్డకు బయల్దేరండి
- ●IND vs ENG 2nd T20 | నేడు భారత్-ఇంగ్లండ్ రెండో టీ20.. మళ్లీ వానగండం తప్పదా.?
- ●Aadhaar | ఇక ఆధార్‌లో ఈ-మెయిల్ అప్డేట్ ఇంటి నుంచే.. యూఐడీఏఐ కొత్త సౌకర్యం..
- ●Arvind Kejriwal | ప్రధానికి తెలియకుండా ఇది అసాధ్యం.. రామాలయ విరాళాల దుర్వినియోగంపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
- ●Garmin | గార్మిన్ కొత్త ఫోర్రన్నర్ సిరీస్.. ఏఐ ట్రైనింగ్, మ్యూజిక్‌తో మూడు స్మార్ట్‌వాచ్‌లు లాంచ్..

Telangana Agriculture | తెలంగాణలో 10.20 లక్షల ఎకరాలకు తగ్గిన సాగు.. మరి వరి సాగు ఎంతో తెలుసా..?

Vinod Kumar | పిచ్చి పిచ్చి సవాళ్లెందుకు.. ఫస్ట్ మేడిగడ్డకు బయల్దేరండి

IND vs ENG 2nd T20 | నేడు భారత్-ఇంగ్లండ్ రెండో టీ20.. మళ్లీ వానగండం తప్పదా.?

Aadhaar | ఇక ఆధార్‌లో ఈ-మెయిల్ అప్డేట్ ఇంటి నుంచే.. యూఐడీఏఐ కొత్త సౌకర్యం..






