త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Leopard | శంషాబాద్ విమానాశ్ర‌యం స‌మీపంలో చిరుత సంచారం.. భ‌యాందోళ‌న‌ల్లో స్థానికులు

Leopard | హైద‌రాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్ర‌యం (Shamshabad Airport) వ‌ద్ద చిరుతపులి (Leopard ) సంచారం క‌ల‌క‌లం సృష్టించింది. శ‌నివారం ఉద‌యం ఎయిర్‌పోర్టు స‌మీపంలోని చిన్మ‌య‌ స్కూల్ (Chinmaya School) వ‌ద్ద స్థానికుల‌కు చిరుత క‌నిపించింది.

G

Hyderabad | Published On Jun 27, 2026, 12.23 pm IST

Leopard | శంషాబాద్ విమానాశ్ర‌యం స‌మీపంలో చిరుత సంచారం.. భ‌యాందోళ‌న‌ల్లో స్థానికులు
Advertisement

Leopard | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్ర‌యం (Shamshabad Airport) వ‌ద్ద చిరుతపులి (Leopard ) సంచారం క‌ల‌క‌లం సృష్టించింది. శ‌నివారం ఉద‌యం ఎయిర్‌పోర్టు స‌మీపంలోని చిన్మ‌య‌ స్కూల్ (Chinmaya School) వ‌ద్ద స్థానికుల‌కు చిరుత క‌నిపించింది. దీంతో అట‌వీ అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న ఫారెస్టు సిబ్బంది స్కూలు ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించారు. చిరుత ఆన‌వాళ్ల కోసం గాలింపుచేప‌ట్టారు.

స్కూలు స‌మీపంలో చిరుత సంచిస్తున్న‌ట్లు తెలియ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అట‌వీ అధికారులు సూచించారు. చిరుత క‌నిపిస్తే వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించాల‌ని తెలిపారు.

Advertisement
Advertisement