Bhagyaraj Telugu Movies | భాగ్యరాజ్ తెలుగులో చేసిన సినిమాలు ఇవే – మగధీరకు డైలాగ్స్ – నాగార్జున బాలీవుడ్ మూవీకి డైరెక్టర్‌గా…
తమిళ దర్శకుడు భాగ్యరాజ్ తెలుగులో నటుడిగా కొన్ని సినిమాలు చేశారు. ఆయన తమిళ సినిమాలను చిరంజీవి, వెంకటేష్ వంటి హీరోలు తెలుగులోకి రీమేక్ చేశారు. నాగార్జున బాలీవుడ్ మూవీకి భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. తెలుగు సినీ పరిశ్రమతో భాగ్యరాజ్‌కు చక్కటి అనుబంధముంది.
Entertainment | Published On Jun 27, 2026, 12.12 pm IST
Bhagyaraj Telugu Movies | తమిళ దిగ్గజ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న భాగ్యరాజ్ తెలుగు సినీ పరిశ్రమతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన పలు తమిళ సినిమాలు తెలుగులోకి రీమేక్ అయ్యాయి. అంతే కాకుండా భాగ్యరాజా హీరోగా నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి విజయాలను అందుకున్నాయి. పలు స్ట్రెయిట్ సినిమాలతో నటుడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
వెంకటేష్, చిరంజీవి....
భాగ్యరాజా దర్శకత్వం వహించిన సువరిల్లద చిత్రాంగళ్ (పేదల బ్రతుకులు), ఒరు కాయ్ ఒసై (ప్రణయగీతం), మౌన గీతాంజల్ ( సత్యభామ), అంధ 7 నాటక్కల్ (రాధా కళ్యాణం), ముంధానై ముడిచ్చు (మూడుముళ్లు), ఎంగ చిన్న రాసా (అబ్బాయిగారు) తో పాటు మరికొన్ని సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. ఇక్కడ కూడా పెద్ద హిట్టుగా నిలిచాయి. నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ బిస్టర్ బేచ్రాకు భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనిల్ కపూర్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించారు.సుమన్, సుధాకర్, తనికెళ్లభరణితో పాటు తెలుగు నటులను తమిళ సినిమాలకు తానే పరిచయం చేశారు. రాజేంద్రప్రసాద్ మిస్టర్ పెళ్లాం మూవీకి భాగ్యారాజ్ కథను అందించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ మగధీర తమిళంలోకి మావీరన్ పేరుతో డబ్ అయ్యింది. ఈ తమిళ డబ్బింగ్ వెర్షన్‌కు భాగ్యరాజ్ డైలాగ్స్ అందించారు.
నటుడిగా....
తెలుగులో నటుడిగా పలు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశారు భాగ్యరాజా. అవునా, రెడ్ అలెర్ట్, మేం వయసుకు వచ్చాం, 35 చిన్న కథ కాదు, కుబేర, సీత సినిమాల్లో సాఫ్ట్ రోల్స్ చేశారు. భాగ్యరాజా హీరోగా నటించిన కొన్ని తమిళ సినిమాలు చిన్న రాజా, వద్దంటే పెళ్లి, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, చిలిపి పెళ్లాం పేరుతో డబ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.
సంబంధిత వార్తలు

Bhagyaraj | కోలీవుడ్‌లో విషాదం – దిగ్గజ దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత – గురువు మరణించిన కొద్ది రోజులకే…
జూన్ 27, 2026

Pawan Kalyan – Vijay | పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేసిన దళపతి విజయ్ తమిళ సినిమాలు ఇవే – రెండు ఇండస్ట్రీ హిట్స్
మే 10, 2026

Thalapathy Vijay | దళపతి విజయ్ తమిళంలోకి రీమేక్ చేసిన తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే…
మే 5, 2026
తాజావార్తలు
- ●Leopard | శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనల్లో స్థానికులు
- ●Neeraj Chopra | ఆసియా గేమ్స్‌లో నీరజ్ చోప్రా.. గాయం నుంచి కోలుకుంటున్న బల్లెం వీరుడు..
- ●Egypt Vs Iran | ఈజిప్ట్-ఇరాన్ మ్యాచ్ డ్రా..
- ●Standard Engineering Technology | ఏఐ రంగంలోకి స్టాండర్డ్ ఇంజినీరింగ్.. షేర్లపై అందరి దృష్టి..
- ●Pregnant Woman | కడుపులోని బిడ్డకు డీఎన్ఏ టెస్ట్.. భర్త, అత్త వేధింపులతో గర్భిణి ఆత్మహత్య
- ●Speeding Truck | బాలికను ఢీకొట్టి.. ఆపై పోలీసులపైకి దూసుకెళ్లి.. ఛత్తీస్‌గఢ్‌లో లారీ బీభత్సం

Leopard | శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనల్లో స్థానికులు

Neeraj Chopra | ఆసియా గేమ్స్‌లో నీరజ్ చోప్రా.. గాయం నుంచి కోలుకుంటున్న బల్లెం వీరుడు..

Egypt Vs Iran | ఈజిప్ట్-ఇరాన్ మ్యాచ్ డ్రా..

Standard Engineering Technology | ఏఐ రంగంలోకి స్టాండర్డ్ ఇంజినీరింగ్.. షేర్లపై అందరి దృష్టి..



