Standard Engineering Technology | ఏఐ రంగంలోకి స్టాండర్డ్ ఇంజినీరింగ్.. షేర్లపై అందరి దృష్టి..
Standard Engineering Technology | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలోకి అడుగుపెట్టేందుకు స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ జీస్కేల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లో గరిష్టంగా 51 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది.
Standard Engineering Technology | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలోకి అడుగుపెట్టేందుకు స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ జీస్కేల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లో గరిష్టంగా 51 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ పరిణామంతో సోమవారం స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. జీస్కేల్ ఎనర్జీ డేటా సెంటర్ ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కొనుగోలు పూర్తయిన తర్వాత ఆ సంస్థ స్టాండర్డ్ ఇంజినీరింగ్ అనుబంధ సంస్థగా మారనుంది. ఈ ఒప్పందం ద్వారా ఏఐ డేటా సెంటర్ విభాగంలో అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని మొదటి నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం లేకుండా, జీస్కేల్‌కు ఇప్పటికే ఉన్న అనుభవాన్ని నేరుగా వినియోగించుకునే అవకాశం స్టాండర్డ్ ఇంజినీరింగ్‌కు లభించనుంది.
రూ.500 కోట్ల పెట్టుబడి దిశగా..
అలాగే హైపర్‌స్కేలర్ కంపెనీలతో ఉన్న సంబంధాలు, మార్కెట్‌కు సిద్ధంగా ఉన్న లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐలు) కూడా కంపెనీకి అందుబాటులోకి రానున్నాయి. దీంతో 2030 నాటికి ప్రపంచ ఏఐ డేటా సెంటర్ క్యాపెక్స్ మార్కెట్ 5.2 ట్రిలియన్ నుంచి 6.7 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల వరకు చేరుకునే అవకాశాన్ని వినియోగించుకునే దిశగా కంపెనీ వేగంగా ముందుకు సాగనుంది. ఈ కొనుగోలును ప్రైమరీ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్‌తో పాటు, జీస్కేల్ ప్రస్తుత వాటాదారులతో వ్యూహాత్మక షేర్ స్వాప్ ఒప్పందం ద్వారా పూర్తి చేయాలని కంపెనీ నిర్ణయించింది. తొలి దశ పెట్టుబడిగా సుమారు రూ.190 కోట్లను కేటాయించింది. అలాగే విస్తృత దశల వారీ ప్రణాళికలో భాగంగా మొత్తం రూ.500 కోట్ల పెట్టుబడికి కూడా ఆమోదం తెలిపింది. ఈ నిధులను ఈక్విటీ కొనుగోలు, సామర్థ్య విస్తరణ, ఉమ్మడి వ్యాపారానికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కోసం వినియోగించనుంది. ఈ పెట్టుబడి మొత్తాన్ని కంపెనీ తన అంతర్గత నగదు ప్రవాహాల ద్వారానే సమకూర్చనున్నట్లు వెల్లడించింది.
50 శాతం వరకు ఆదాయ వృద్ధి లక్ష్యం..
జీస్కేల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, ప్రస్తుత నాయకత్వ బృందమే సంస్థను కొనసాగిస్తుండగా, స్టాండర్డ్ ఇంజినీరింగ్ వ్యూహాత్మక మార్గదర్శకత్వం, పెట్టుబడి, తయారీ సామర్థ్యం, సమగ్ర అమలు నైపుణ్యాన్ని అందించనుంది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా కంపెనీ ఆశావహ అంచనాలను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఆర్డర్ బుక్, వినియోగదారులతో కొనసాగుతున్న ఒప్పందాలు, వృద్ధి ప్రణాళికల ఆధారంగా ఇప్పటికే ఉన్న ప్రధాన ఇంజినీరింగ్ వ్యాపారంలో 40 నుంచి 50 శాతం వరకు ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే మార్కెట్ పరిస్థితులు, ప్రాజెక్టుల అమలు పురోగతిపై ఈ అంచనాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ కొనుగోలు ద్వారా ఔషధ, రసాయన, బయోటెక్నాలజీ రంగాలకు కాన్సెప్ట్ నుంచి కమిషనింగ్ వరకు ఇంజినీరింగ్ సేవలు అందించిన అనుభవాన్ని ఉపయోగించి, వేగంగా విస్తరిస్తున్న భారత ఏఐ డేటా సెంటర్ రంగంలో కూడా కంపెనీ బలమైన స్థానం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
డేటా సెంటర్ మౌలిక వసతుల రంగంలో..
2030 నాటికి భారత్‌లో ఏఐ, హైపర్‌స్కేల్ డేటా సెంటర్ మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు 20 నుంచి 25 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి అవసరమవుతుందని, ఈ భారీ నిర్మాణ కార్యక్రమంలో ప్రముఖ ఇంజినీరింగ్ భాగస్వామిగా నిలవాలని స్టాండర్డ్ ఇంజినీరింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. షేర్ పనితీరును పరిశీలిస్తే, మార్చిలో రూ.104.56 వద్ద జీవితకాల కనిష్ఠ స్థాయిని తాకిన తర్వాత ఏప్రిల్‌లో కొనుగోలు ఆసక్తి పెరగడంతో స్టాక్ 30 శాతం ఎగిసింది. జూన్ నెలలోనే ఇప్పటివరకు 60 శాతానికి పైగా ర్యాలీ నమోదు చేసింది. గత మూడు నెలల్లో షేర్ 104 శాతం లాభపడగా, 2026లో ఇప్పటివరకు 42 శాతం పెరిగింది. దీంతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న స్మాల్‌క్యాప్ విభాగంలో ఈ స్టాక్ విశేషంగా రాణించిన షేర్లలో ఒకటిగా నిలిచింది.
తాజావార్తలు
- ●Leopard | శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనల్లో స్థానికులు
- ●Neeraj Chopra | ఆసియా గేమ్స్‌లో నీరజ్ చోప్రా.. గాయం నుంచి కోలుకుంటున్న బల్లెం వీరుడు..
- ●Egypt Vs Iran | ఈజిప్ట్-ఇరాన్ మ్యాచ్ డ్రా..
- ●Bhagyaraj Telugu Movies | భాగ్యరాజ్ తెలుగులో చేసిన సినిమాలు ఇవే - మగధీరకు డైలాగ్స్ - నాగార్జున బాలీవుడ్ మూవీకి డైరెక్టర్‌గా...
- ●Pregnant Woman | కడుపులోని బిడ్డకు డీఎన్ఏ టెస్ట్.. భర్త, అత్త వేధింపులతో గర్భిణి ఆత్మహత్య
- ●Speeding Truck | బాలికను ఢీకొట్టి.. ఆపై పోలీసులపైకి దూసుకెళ్లి.. ఛత్తీస్‌గఢ్‌లో లారీ బీభత్సం

Leopard | శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనల్లో స్థానికులు

Neeraj Chopra | ఆసియా గేమ్స్‌లో నీరజ్ చోప్రా.. గాయం నుంచి కోలుకుంటున్న బల్లెం వీరుడు..

Egypt Vs Iran | ఈజిప్ట్-ఇరాన్ మ్యాచ్ డ్రా..

Bhagyaraj Telugu Movies | భాగ్యరాజ్ తెలుగులో చేసిన సినిమాలు ఇవే - మగధీరకు డైలాగ్స్ - నాగార్జున బాలీవుడ్ మూవీకి డైరెక్టర్‌గా...




