త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Egypt Vs Iran | ఈజిప్ట్‌-ఇరాన్‌ మ్యాచ్‌ డ్రా..

Egypt Vs Iran | ఫిఫా ప్రపంచకప్‌-2026లో ఇరాన్‌ జట్టు నాకౌట్‌ దశకు చేరుతుందా లేదా అన్నది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. గ్రూప్‌-జీ చివరి మ్యాచ్‌లో ఈజిప్ట్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఇరాన్‌ 1-1తో డ్రా చేసుకుంది. చివరి క్షణాల్లో వచ్చిన గోల్‌ వీఏఆర్‌ నిర్ణయంతో రద్దవడంతో ఇరాన్‌ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది.

P

Sports | Published On Jun 27, 2026, 12.13 pm IST

Egypt Vs Iran | ఈజిప్ట్‌-ఇరాన్‌ మ్యాచ్‌ డ్రా..
Advertisement
  • వీఏఆర్‌ నిర్ణయతో ఇరాన్‌కు ఎదురుదెబ్బ
  • నాకౌట్‌ ఆశలు ఆవిరి
  • ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారం

Egypt Vs Iran | ఫిఫా ప్రపంచకప్‌-2026లో ఇరాన్‌ జట్టు నాకౌట్‌ దశకు చేరుతుందా లేదా అన్నది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. గ్రూప్‌-జీ చివరి మ్యాచ్‌లో ఈజిప్ట్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఇరాన్‌ 1-1తో డ్రా చేసుకుంది. చివరి క్షణాల్లో వచ్చిన గోల్‌ వీఏఆర్‌ నిర్ణయంతో రద్దవడంతో ఇరాన్‌ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఈ ఫలితంతో ఇప్పటికే రౌండ్‌ ఆఫ్‌-32కు అర్హత సాధించిన ఈజిప్ట్‌ ఐదు పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్‌లో ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో బెల్జియం ఉండగా.. ఈజిప్ట్‌ రెండోస్థానంలో కొనసాగుతోంది. ఇరాన్‌ మూడు పాయింట్లతో మూడోస్థానంలో నిలిచింది. అయితే, రౌండ్‌ ఆఫ్‌ 32కి అర్హత సాధించేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది.

మ్యాచ్‌ ఆరంభంలోనే ఈజిప్ట్‌ దూకుడు చూపించింది. ఐదో నిమిషంలో మహమ్మద్‌ సలాహ్‌ గోల్‌ వేసేందుకు ప్రయత్నించగా.. బంతికి రీబౌండ్‌ను మహ్మద్‌ సాబెర్‌ గోల్‌గా మలిచి ఆధిక్యంలో నిలిపాడు. అయితే, ఇరాన్‌ వెంటనే స్పందించింది. 14వ నిమిషంలో రామిన్‌ రెజాయియన్‌ అద్భుతమైన షాట్‌తో గోల్‌ చేసి స్కోర్‌ని సమం చేశాడు. తొలి అర్ధభాగంలో ఇరాన్‌కు పెనాల్టీ అవకాశం లభించినా మెహ్దీ తారెమీ దాన్ని గోల్‌గా మలచలేకపోయాడు. ఈజిప్ట్‌ గోల్‌కీపర్‌ ముస్తఫా షోబీర్‌ అద్భుతంగా అడ్డుకున్నాడు. తర్వాత అతడు మరో కీలక సేవ్‌ చేసినా, రీబౌండ్‌ను రెజాయియన్‌ ఉపయోగించుకుని గోల్‌ సాధించాడు. మ్యాచ్‌ కొనసాగిన కొద్దీ ఇరాన్‌ ఆధిపత్యం చెలాయించింది. రెండో అర్ధభాగంలో ఈజిప్ట్‌ డిఫెన్స్‌కే పరిమితమైంది. కానీ ఇరాన్‌కు వరుస అవకాశాలను కోల్పోయింది. తారెమీకి వచ్చిన మరో మంచి అవకాశం క్రాస్‌బార్‌ను తాకి బయటకు వెళ్లిపోయింది.

ఇంజ్యురీ టైమ్‌లో చివరి దాడి ఉత్కంఠను పీక్‌కు తీసుకెళ్లింది. 93వ నిమిషంలో షోజా ఖలిల్‌జాదె గోల్‌ చేయడంతో ఇరాన్‌ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. నాకౌట్‌ బెర్త్‌ ఖాయమైందని భావించిన ఇరాన్‌ బెంచ్‌ మైదానంలోకి పరుగులు తీసింది. అయితే, ఆ ఆనందం కొన్ని క్షణాల్లోనే ఆవిరైంది. వీఏఆర్‌ సమీక్షలో ఖలిల్‌జాదె ఆఫ్‌సైడ్‌లో ఉన్నట్లు తేలడంతో గోల్‌ను రద్దు చేశారు. దీంతో ఇరాన్‌ ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. మ్యాచ్‌ ఆరంభం నుంచే స్టేడియంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈజిప్ట్‌, ఇరాన్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మ్యాచ్‌ మొత్తంగా ఉత్కంఠతో సాగింది. ఈ డ్రాతో ఈజిప్ట్‌ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరింది. ఇరాన్‌ మాత్రం మూడో స్థానంలో ముగించి.. మిగిలిన గ్రూప్‌ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచకప్‌ ప్రయాణం కొనసాగుతుందా? అన్నది ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉన్నది.

Advertisement
Advertisement