World drug day awareness rally | డ్రగ్స్ నిర్మూలన మా బాధ్యతే కాదు.. మనందరిది
World drug day awareness rally | మత్తు పదార్థాల నిర్మూలన కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ఇందులో ప్రతి పౌరుడి భాగస్వామ్యం, సామూహిక బాధ్యత ఎంతో అవసరమని మంగళ్‌హాట్ పోలీసులు పేర్కొన్నారు. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా శుక్రవారం పురానాపూల్ నుండి జియాగూడ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
- అవగాహన ర్యాలీలో మంగళ్‌హాట్ పోలీసుల పిలుపు
World drug day awareness rally | త్రినేత్ర.న్యూస్: మత్తు పదార్థాల నిర్మూలన కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ఇందులో ప్రతి పౌరుడి భాగస్వామ్యం, సామూహిక బాధ్యత ఎంతో అవసరమని మంగళ్‌హాట్ పోలీసులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మత్తుపదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా శుక్రవారం పురానాపూల్ నుండి జియాగూడ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్లు, అడిషనల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, స్థానిక పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు. మత్తు వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక అనర్థాలను వివరించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పెద్దపెట్టున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వారిని చైతన్యపరచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ముఖ్యమన్నారు. మత్తు పదార్థాల సరఫరా లేదా వినియోగం గురించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. కాగా అంతకుముందు నిర్వహించిన ర్యాలీని గోల్కొండ జోన్ అడిషనల్ డీసీపీ కృష్ణ గౌడ్, కుల్సుంపురా డివిజన్ ఏసీపీ వి.తిరుపతి పర్యవేక్షించారు
.
తాజావార్తలు
- ●Ecuador | 20 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచకప్ నాకౌట్‌కు.. నేషనల్ హాలీడే ప్రకటించిన అధ్యక్షుడు డేనియల్ నొబోవా
- ●Waterways Leisure Tourism IPO | వాటర్‌వేస్ లీజర్ టూరిజం ఐపీవోకు భారీ స్పందన.. అలాట్మెంట్ ఎప్పుడు..?
- ●Sanchita Ugale | ఆత్మహత్య చేసుకున్న తొమ్మిది రోజుల తర్వాత బాలీవుడ్ నటి అంత్యక్రియలు
- ●Russia-Ukraine War | రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్
- ●Japan Vs Sweden | డ్రాగా ముగిసినా.. నాకౌట్‌కు జపాన్, స్వీడన్
- ●Mango | మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారా? న్యూట్రిషనిస్టులు చెప్పిన నిజం..

Ecuador | 20 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచకప్ నాకౌట్‌కు.. నేషనల్ హాలీడే ప్రకటించిన అధ్యక్షుడు డేనియల్ నొబోవా

Waterways Leisure Tourism IPO | వాటర్‌వేస్ లీజర్ టూరిజం ఐపీవోకు భారీ స్పందన.. అలాట్మెంట్ ఎప్పుడు..?

Sanchita Ugale | ఆత్మహత్య చేసుకున్న తొమ్మిది రోజుల తర్వాత బాలీవుడ్ నటి అంత్యక్రియలు

Russia-Ukraine War | రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్






