త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | బంజారాహిల్స్‌లో రౌడీషీట‌ర్ల వీరంగం.. బంగారంలో షాపులోకి చొర‌బ‌డి..

Hyderabad | హైద‌రాబాద్‌లో (Hyderabad) రోజురోజుకు శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణిస్తున్నాయి. నేపాలీ గ్యాంగ్‌లు, దొంగ‌లు, రౌడీ షీట‌ర్లు రెచ్చిపోతున్నారు.

G

Hyderabad | Published On Jun 27, 2026, 10.14 am IST

Hyderabad | బంజారాహిల్స్‌లో రౌడీషీట‌ర్ల వీరంగం.. బంగారంలో షాపులోకి చొర‌బ‌డి..
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో (Hyderabad) రోజురోజుకు శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణిస్తున్నాయి. నేపాలీ గ్యాంగ్‌లు, దొంగ‌లు, రౌడీ షీట‌ర్లు రెచ్చిపోతున్నారు. బంజారాహిల్స్‌లోని (Banjarahills) రోడ్ నంబ‌ర్ 10లో ఉన్న శ్రీ సాయి జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్‌లోకి ఇద్ద‌రు వ్య‌క్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. రూ.ల‌క్ష‌లు ఇవ్వాలంటూ దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డారు.

మ‌ద్యం మ‌త్తులో ఉన్న అలీమ్, యూనస్ అనే ఇద్దరు వ్య‌క్తులు షోరూమ్‌లోకి ప్రవేశించారు. మేనేజర్ పంకజ్ బండ్గర్‌ను కత్తితో బెదిరించారు. అనంతరం రూ.లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. మ‌ళ్లీ వ‌స్తామ‌ని, డబ్బులు సిద్ధంగా ఉంచుకోవాలని హెచ్చ‌రించి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. దీంతో భయాందోళనకు గురైన షోరూమ్ మేనేజర్ పంకజ్ బండ్గర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌లు ప‌రిశీలించిన అనంత‌రం అలీమ్, యూనస్‌లను అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement