త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar Reddy | అజీజ్‌నగర్‌లోనూ ఎఫ్‌టీఎల్‌లో ఫామ్‌హౌస్ క‌ట్టుకున్న‌రు

Chamala Kirankumar Reddy | అజీజ్‌నగర్‌లోనూ చెరువు పక్కన ఎఫ్.టి.ఎల్ లో 111 జీవో పరిధిలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

S

Telangana | Published On Sep 20, 2026, 3.05 pm IST

Chamala Kirankumar Reddy | అజీజ్‌నగర్‌లోనూ ఎఫ్‌టీఎల్‌లో ఫామ్‌హౌస్ క‌ట్టుకున్న‌రు
Advertisement
  • కేసీఆర్ 2004 అఫిడవిట్‌లో ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ ఉందా?
  • 2009లో కేటీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు జన్వాడ ఫామ్‌హౌస్ అఫిడవిట్‌లో ఉందా?
  • రబ్బరు చెప్పులతో తిరిగిన హరీష్ రావుకు 2004 అఫిడవిట్‌లో లేని ఆస్తులు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయ్
  • భువ‌న‌గిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూటి ప్ర‌శ్న‌లు

Chamala Kirankumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: అజీజ్‌నగర్‌లోనూ చెరువు పక్కన ఎఫ్.టి.ఎల్ లో 111 జీవో పరిధిలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. నిన్న జ‌న్వాడ‌లో, ఈరోజు అజీజ్‌నగర్, మోయినాబాద్ భూములు, ఫామ్ హౌస్ లు పరిశీలించడానికి వచ్చామ‌న్నారు. 2004 అఫిడ‌విట్‌లో ఎర్ర‌వెల్లి ఫామ్‌హౌస్ ఉందా అని ప్ర‌శ్నించారు. 2009లో కేటీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన‌ప్పుడు జ‌న్వాడ ఫామ్‌హౌస్ అఫిడ‌విట్‌లో ఉందా అని నిల‌దీశారు. ర‌బ్బ‌రు చెప్పుల‌తో తిరిగిన హ‌రీశ్ రావుకు ఆస్తులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌న్నారు. అజీజ్‌న‌గ‌ర్‌లో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

సిద్దిపేటలో హరీశ్‌రావు ఫామ్‌హౌస్, వాళ్ళ మామ భూములను పరిశీలించాం. నిన్న జ‌న్వాడ‌లో కేటీఆర్ భూములను పరిశీలించాం. మేం పరిశీలించే భూముల గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాకు భూముల గురించి ఎన్నికల అఫిడవిట్‌లో పెట్టాం. మేం ఆగర్భ శ్రీమంతులం అని కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు. మీ తాత‌లు ఇచ్చి ఆస్తులు అనుకుంటున్న‌రా? విదేశాల నుంచి వ‌చ్చి ఆస్తులెన్నో డిక్లేర్ చేసిన‌వా కేటీఆర్‌. అందుకే క్షేత్ర‌స్థాయికి వ‌చ్చి అన్ని వివ‌రాలు చెబుతున్నాం.

నిజాం కంటే ఎక్కువ సంపాదించారు..

తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాది ఎకరాలను పేద ప్రజలకు పంచారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో వినోభా బావే భూములను పంచారు. నిజాం 200 ఏళ్లలో సంపాదించిన దాని కంటే కేసీఆర్ కుటుంబం పదేళ్లలో ఆస్తులు సంపాదించింది. కేసీఆర్ కుటుంబానిది చింతమడక కానీ ఎర్రవెల్లి, రంగ నాయక సాగర్, జన్వాడ, అజీజ్‌నగర్, మొయినాబాద్‌లో ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి?

300 ఎక‌రాలు ఎందుకు పంచ‌లేదు?

కేసీఆర్ 2004 అఫిడవిట్‌లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఉందా? దేశంలో ఏ ఇరిగేషన్ శాఖా మంత్రి అయినా ప్రాజెక్టు కట్టి అక్కడే ఫామ్‌హౌస్ కట్టుకున్నారా? ఉద్యమ సమయంలో రబ్బరు చెప్పులతో తిరిగిన హరీష్ రావుకు 2004లో అఫిడవిట్ లో లేని ఆస్తులు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? మేం తెలంగాణ ఉద్యమకారులం అని కేసీఆర్ కుటుంబం ప్రజలను నమ్మించింది. కేసీఆర్ పదేళ్లలో తన ఫామ్‌హౌస్ పక్కన ఉన్న 300 ఎకరాల అసైన్డ్ భూమిని దళితులకు,పేదలకు ఎందుకు పంచలేదు? రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తుంగతుర్తి, మహబూబాబాద్, ఎల్బీ నగర్ లో భూములు పేదలకు పట్టాలు ఇచ్చారు అని చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement