త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ద‌స‌రాకు గుర్తురాలేదా రేవంతూ.. మండిప‌డుతున్న తెలంగాణ వాదులు

Revanth Reddy | సంక్రాంతి (Sankranti) కి వాహ‌నాల‌లో ఊరెళ్లేవారికి టోల్ ఫీజు (Toll Fee) మిన‌హాయింపు ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నిర్ణ‌యంపై తెలంగాణ వాదులు మండిప‌డుతున్నారు. మూడు నెల‌ల క్రితం వ‌చ్చిన ద‌స‌రా (Dasara) పండుగ‌కు టోల్ మిన‌హాయింపు ఇవ్వాల‌ని గుర్తుకు రాలేదా అని ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు ఖ‌జానా ఖాళీగా ఉందంటున్న రేవంత్‌.. ఈ సొమ్ములు ఎక్క‌డి నుంచి చెల్లిస్తార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

A

Telangana | Published On Dec 30, 2025, 5.51 pm IST

Revanth Reddy | ద‌స‌రాకు గుర్తురాలేదా రేవంతూ.. మండిప‌డుతున్న తెలంగాణ వాదులు
Advertisement

Revanth Reddy | సంక్రాంతి (Sankranti) కి వాహ‌నాల‌లో ఊరెళ్లేవారికి టోల్ ఫీజు (Toll Fee) మిన‌హాయింపు ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నిర్ణ‌యంపై తెలంగాణ వాదులు మండిప‌డుతున్నారు. మూడు నెల‌ల క్రితం వ‌చ్చిన ద‌స‌రా (Dasara) పండుగ‌కు టోల్ మిన‌హాయింపు ఇవ్వాల‌ని గుర్తుకు రాలేదా అని ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు ఖ‌జానా ఖాళీగా ఉందంటున్న రేవంత్‌.. ఈ సొమ్ములు ఎక్క‌డి నుంచి చెల్లిస్తార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. టోల్ ఫీజు మిన‌హాయింపు అస‌లు ఎవ‌రు అడిగార‌ని దుయ్య‌బ‌డుతున్నారు.

కోసుకుతిన్నా రూపాయిలేదు..

రాష్ట్ర ఆర్థిక స్థితిపై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప‌లుమార్లు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ఉద్దేశించి త‌న‌ను కోసుకుతిన్నా రూపాయిలేద‌ని, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దివాళా తీసింద‌ని చెప్పారు. స‌చివాలయంలో లంకెబిందెలుంటాయ‌నుకుంటే ఖాళీ బిందెలు ద‌ర్శ‌న‌మిచ్చాయ‌ని ఒక సంద‌ర్భంలో వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వెళ్తే దొంగ‌ల‌ను చూసిన‌ట్లు చూస్తున్నార‌ని.. ఎవ‌రూ రానీవ‌డం లేద‌ని, చెప్పులు ఎత్తుకుపోయేవాళ్ల‌లాగా చూస్తున్నార‌ని మ‌రొక సంద‌ర్భంలో వ్యాఖ్యానించారు. అలాంటి ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు టోల్ ఫీజు మిన‌హాయింపుకు రూ.కోట్లు ఎలా చెల్లిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

తెలంగాణ‌లో గ్రామ‌గ్రామానా ద‌స‌రా వేడుక‌లు..

సాధార‌ణంగా తెలంగాణ‌లో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున జ‌రుపుకునే పండుగ ద‌స‌రా. బ‌తుకుతెరువు కోసం ఎక్క‌డెక్క‌డో స్థిర‌ప‌డిన ప్ర‌జ‌లు సైతం త‌మ స్వంత గ్రామాల‌కు చేరుకుంటారు. దీంతో గ్రామాలు బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ‌ల రోజు క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రెండు ద‌స‌రా పండుగ‌లు జ‌రుపుకున్న‌ప్ప‌టికీ ఆ దిశ‌గా ప్ర‌భుత్వం ఎప్పుడూ ఆలోచించ‌క‌పోవ‌డంపై తెలంగాణ వాదులు, ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

సంక్రాంతి అనేవి తెలంగాణ‌కు పీడ‌దినాలు..

సాధార‌ణంగా సంక్రాంతి పండుగ‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున జ‌రుపుకుంటారు. తెలంగాణ‌లో ద‌స‌రా ఎంత అట్టాహాసంగా జ‌రుపుకుంటారో అక్క‌డి ప్ర‌జ‌లు కూడా అదే స్థాయిలో సంక్రాంతి పండుగ వేడుక‌లు చేసుకుంటారు. తెలంగాణ ప్ర‌జ‌లు సంక్రాంతి పండుగ‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌రు. పైపెచ్చు తెలంగాణ‌లో సంక్రాంతి రోజుల‌ను పీడ‌దినాలుగా భావిస్తుంటారు. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం ఎందుకు గుర్తించ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

తిరుప‌తికి వెళ్లే ముందు మీడియాకు లీకులు..

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌నానికి వెళ్తూ టోల్‌ఫీజు మినాయింపుపై మీడియాకు లీకులు వ‌దిలి వెళ్లారు. దీనిపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు ముందుగా ఈ స‌మాచారం లీక్ చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. టోల్ ఫీజు మిన‌హాయింపు గురించి ఎవ‌రు అడిగార‌ని ప్ర‌భుత్వం ఇంత ఆంధ్రాభిమానం చూపుతుంద‌ని విమ‌ర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న‌ది తెలంగాణ ప్ర‌భుత్వం కాద‌ని, ఆంధ్రా అధికారం న‌డుస్తున్న‌ద‌ని మండిప‌డుతున్నారు. ఇంత‌కీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ టోల్ కూడా తెలంగాణ ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుందా స్ప‌ష్టం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement