త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khairatabad Ganesh | ఆల‌స్య‌మ‌వ‌నున్న ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడి నిమ‌జ్జ‌నం

Khairatabad Ganesh | హైద‌రాబాద్‌లో వినాయ‌క ఉత్స‌వాల్లో ప్ర‌ధాన‌మైన ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి (Khairatabad Ganesh) నిమ‌జ్జ‌నం. ప్ర‌తి ఏడాది ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు బ‌డా గ‌ణ‌ప‌తి శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తిచేసేవారు. అయితే ఈ సారి కొంత ఆల‌స్యం కానుంది.

G

Hyderabad | Published On Sep 25, 2026, 6.23 am IST

Khairatabad Ganesh | ఆల‌స్య‌మ‌వ‌నున్న ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడి నిమ‌జ్జ‌నం
Advertisement

Khairatabad Ganesh | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో వినాయ‌క ఉత్స‌వాల్లో ప్ర‌ధాన‌మైన ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి (Khairatabad Ganesh) నిమ‌జ్జ‌నం. ప్ర‌తి ఏడాది ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు బ‌డా గ‌ణ‌ప‌తి శోభాయాత్రకు (Shobha Yatra) ఏర్పాట్లు పూర్తిచేసేవారు. అయితే ఈ సారి కొంత ఆల‌స్యం కానుంది. ఇప్ప‌టికి వ‌ర‌కు వినాయ‌కుడు ట‌స్క‌ర్‌పైకి చేరుకోలేదు. రాత్రి 12 గంట‌ల‌కు లంబోధ‌రునికి నిర్వాహ‌కులు క‌ల‌శ‌పూజ నిర్వ‌హించారు. అనంత‌రం భారీ క్రేన్ స‌హాయంతో వినాయ‌కుడిని త‌ర‌లించే ట‌స్క‌ర్ వాహ‌నంపైకి చేర్చాల్సి ఉంది. అయితే భారీ హైడ్రాలిక్ క్రేన్ వేడి కార‌ణంగా రిపేర్‌కు గురికావ‌డంతో.. దానిని బాగుచేయ‌డానికి 2 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టింది. దీంతో గ‌ణ‌నాథుడి నిమ‌జ్జ‌న (Immersion) ప్ర‌క్రియ ఆల‌స్యం కానుంది. ఈ నేప‌థ్యంలో వీలైనంత తొంద‌ర‌గా మ‌హాగ‌ణ‌ప‌తిని గంగ‌మ్మ ఒడికి చేర్చేలా పోలీసులు చూస్తున్నారు.

కాగా, ప్ర‌స్తుతం భారీ గ‌ణ‌నాదుడిని వేదిక‌పై నుంచి ట‌స్క‌ర్‌పైకి చేర్చుతున్నారు. అనంత‌రం వెల్డింగ్ ప‌నులు పూర్తి కావాల్సి ఉంటుంది. దానికి సుమారు 2 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. అనంత‌రం పూజ‌లు నిర్వ‌హించి శోభాయాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. గ‌తేడాది ఉద‌యం 6 గంట‌ల‌కు ఖైర‌తాబాద్ బ‌డా గ‌ణేశ్ శోభాయాత్ర ప్రారంభ‌మైంది.

సెప్టెంబర్ 14 నుంచి ఖైరతాబాద్ గణేశుడి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్ర‌తీ సంవ‌త్స‌రాలానే ఈ ఏడాది కూడా సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది కూడా 150 జంటలతో శివపార్వతులు కళ్యాణ మహోత్సవం, 408 జంటలతో మహా హోమం, మహా హారతులు సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల పండువగా ఉత్సవాలు జరిగాయి.

మహాగణపతి నిమజ్జనానికి భారీ సూపర్ క్రేన్​ను జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది. గత ఐదేండ్ల‌ నుంచి గణపతి ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్న సూపర్ క్రేన్స్ సంస్థ ఈసారి చైనాలో తయారు చేసిన క్రేన్​ను తీసుకొచ్చింది. వివిధ భారీ ప్రాజెక్టుల్లో ఏడాది అనుభవం ఉన్న సూపర్ క్రేన్ 300 నుంచి 350 టన్నుల బరువు, 80 మీటర్ల ఎత్తు సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Advertisement
Advertisement