త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khairatabad Ganesh | భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. రేపు రాత్రి వరకే ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి దర్శనం

Khairatabad Ganesh | వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. ఖైరతాబాద్‌ మహా గణపతితో (Khairatabad Ganesh) పాటు హైదరాబాద్‌ నగరంలోని వినాయకుల సామూహిక నిమజ్జనం శుక్ర‌వారం (ఈ నెల 25న) జరగనుంది.

G

Hyderabad | Published On Sep 22, 2026, 6.08 am IST

Khairatabad Ganesh | భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. రేపు రాత్రి వరకే ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి దర్శనం
Advertisement

Khairatabad Ganesh | త్రినేత్ర‌.న్యూస్‌: వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. ఖైరతాబాద్‌ మహా గణపతితో (Khairatabad Ganesh) పాటు హైదరాబాద్‌ నగరంలోని వినాయకుల సామూహిక నిమజ్జనం శుక్ర‌వారం (ఈ నెల 25న) జరగనుంది. మహా గణపతిని ఆ రోజు ఉదయాన్నే శోభాయాత్రగా తరలించి మధ్యాహ్నం నిమజ్జనం (Immersion) చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో బ‌డా గ‌ణేశుడిని ద‌ర్శ‌న భాగ్యం బుధ‌వారం (ఈ నెల 23) రాత్రి వరకే క‌లుగ‌నుంది. నిమ‌జ్జ‌న ఏర్పాట్ల నేప‌థ్యంలో భ‌క్తులను అనుమ‌తించరు. గురువారం ఉద‌యం నుంచే షెడ్డు తొలగింపు, బ్యారికేడ్ల తొలగింపు ప్రక్రియ చేప‌ట్ట‌నున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు, పోలీసులు వెల్ల‌డించారు.

వినాయ‌క చ‌తుర్ధి అన‌గానే మొద‌ట గుర్తుకు వ‌చ్చేది ఖైర‌తాబాద్ గ‌ణేశుడు (Khairatabad Maha Ganapathi). ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో ఉన్న పార్వ‌తీ త‌నయుడు `పంచ‌ముఖ సంక‌ట‌హ‌ర మ‌హా గ‌ణ‌ప‌తి`గా పూజ‌లు అందుకున్నాడు. మ‌హాగ‌ణ‌ప‌తిని చూసేందుకు ప్ర‌తి రోజు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు. రెండు రోజులు మాత్ర‌మే ద‌ర్శ‌నాల‌కు అవ‌కాశం ఉండ‌టంతో భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉంది. కాగా, మహా గణపతిని శోభాయాత్రగా తీసుకెళ్లేందుకు గురువారం ఉదయం నుంచే ఏర్పాట్లు చేయనున్నారు. శుక్ర‌వారం (సెప్టెంబ‌ర్‌ 25న) ఉదయం 6 గంటలకు వాహనాన్ని కదిలించి.. మధ్యాహ్నం 12 గంటల వరకు శోభాయాత్ర, నిమజ్జనం పూర్తిచేసే అవ‌కాశం ఉంది.

Advertisement
Advertisement