Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు తెలంగాణ పోలీసుల షాక్.. సభకు అనుమతి నిరాకరణ..!
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు.
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరిట గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్‌లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు భారీ కార్యక్రమం నిర్వహించాలని జనసేన ఏర్పాట్లు చేసింది. ఈ సభకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు.
పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోలీసుల నిర్ణయంపై స్పందించిన నేతలు.. అవసరమైతే కోర్టును ఆశ్రయించి సభకు అనుమతి పొందేందుకు ప్రయత్నాలు చేయనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సభకు అనుమతి రాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాలకు చెందిన తెలంగాణ నేతలు పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో సభ నిర్వహించ తలపెట్టడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bus Accident | ఆగిఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు దుర్మరణం
ఆగస్టు 26, 2026

Amrit Bharat Express | కాగజ్‌నగర్, ఖమ్మం మీదుగా కోయంబత్తూర్ – ధన్‌బాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
ఆగస్టు 26, 2026

పాలిటిక్స్ వర్సెస్ ప్రోగ్రెస్: గుజరాత్ వర్సెస్ తెలంగాణ హాట్ డిబేట్! రాజకీయ రగడ రగిలించిన జాతీయ చర్చ!
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●Bus Accident | ఆగిఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు దుర్మరణం
- ●Amrit Bharat Express | కాగజ్‌నగర్, ఖమ్మం మీదుగా కోయంబత్తూర్ - ధన్‌బాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
- ●పాలిటిక్స్ వర్సెస్ ప్రోగ్రెస్: గుజరాత్ వర్సెస్ తెలంగాణ హాట్ డిబేట్! రాజకీయ రగడ రగిలించిన జాతీయ చర్చ!
- ●Horoscope | ఆగస్టు 26 రాశిఫలాలు.. ఈ రాశివారు విశ్లేషణాత్మక శక్తితో వాటిని అధిగమిస్తారు!
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

Bus Accident | ఆగిఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు దుర్మరణం

Amrit Bharat Express | కాగజ్‌నగర్, ఖమ్మం మీదుగా కోయంబత్తూర్ - ధన్‌బాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

పాలిటిక్స్ వర్సెస్ ప్రోగ్రెస్: గుజరాత్ వర్సెస్ తెలంగాణ హాట్ డిబేట్! రాజకీయ రగడ రగిలించిన జాతీయ చర్చ!

Horoscope | ఆగస్టు 26 రాశిఫలాలు.. ఈ రాశివారు విశ్లేషణాత్మక శక్తితో వాటిని అధిగమిస్తారు!



