త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS South Africa | ప్ర‌తి బిడ్డా గ‌ర్వంగా చెప్పుకొనే దినం.. జూన్ 2: నాగరాజు గుర్రాల

BRS NRI Founder President South Africa | కేసీఆర్‌ నాయకత్వంలో అనేక త్యాగాలు, ఉద్యమాలు, విద్యార్థుల పోరాటాలు, అమరవీరుల ఆత్మబలిదానాలతో స్వ‌రాష్ట్రం సాకార‌మైంద‌ని.. ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పుకునే ఆత్మగౌరవ చిహ్నం తెలంగాణ రాష్ట్ర‌మ‌ని దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగ‌రాజు గుర్రాల అన్నారు.

S

International | Published On Jun 2, 2026, 12.18 pm IST

BRS South Africa | ప్ర‌తి బిడ్డా గ‌ర్వంగా చెప్పుకొనే దినం.. జూన్ 2: నాగరాజు గుర్రాల
Advertisement

BRS South Africa | త్రినేత్ర‌.న్యూస్‌: కేసీఆర్‌ నాయకత్వంలో అనేక త్యాగాలు, ఉద్యమాలు, విద్యార్థుల పోరాటాలు, అమరవీరుల ఆత్మబలిదానాలతో స్వ‌రాష్ట్రం సాకార‌మైంద‌ని.. ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పుకునే ఆత్మగౌరవ చిహ్నం తెలంగాణ రాష్ట్ర‌మ‌ని దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగ‌రాజు గుర్రాల అన్నారు. రాష్ట్రావిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

దేశ చ‌రిత్ర‌లో సువ‌ర్ణాధ్యాయం..

జూన్ 2 భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. యావత్ తెలంగాణ కలలుగన్న రోజిది. జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేని రోజు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పట్టలేని ఆనందంతో సంబరాలు నిర్వహించిన రోజు. తెలంగాణలోని ప్రతి పల్లె, పట్నం, ఊరు, వాడ చిన్నా పెద్దా తేడా లేకుండా వేడుకలు అంబరాన్నంటిన రోజు జూన్ 2 అని నాగ‌రాజు పేర్కొన్నారు.

ప్ర‌జ‌లు మ‌ళ్లా ఆలోచించాల్సిన స‌మ‌య‌మొచ్చింది..

కానీ ప్రస్తుతం తెలంగాణ పరిస్థితులను చూస్తుంటే ఎక్క‌డ చూసినా నిరాశే క‌నిపిస్తోంది. ఒకప్పుడు అభివృద్ధి దిశగా దూసుకెళ్లిన తెలంగాణ మళ్లీ తిరోగమన దిశలో నడుస్తోందనే భావన ప్రజల్లో పెరుగుతోంది. అటు రైతులు ఆవేదనలో, ఇటు నిరుద్యోగులు ఎదురుచూపుల్లో, అన్ని వర్గాల ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. తెలంగాణను సాధించడం ఒక్కటే కాదు.. సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం కూడా మనందరి బాధ్యత. ప్రజలు మరోసారి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యతిరేక శక్తుల కుట్రలను ఛేదిద్దాం. మన తెలంగాణను, మన భవిష్యత్తును మనమే రక్షించుకుందాం అని నాగ‌రాజు గుర్రాల పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement