త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Love Story | ఇన్‌స్టా ప‌రిచ‌యంతో మొద‌లైన ప్రేమ‌క‌థ‌.. ఆత్మ‌హ‌త్య‌తో ముగిసింది..

Love Story | వారిద్ద‌రిని ఇన్‌స్టాగ్రామ్ (Instagram) క‌లిపింది. ఇరుమ‌ధ్య ప‌రిచ‌యం పెరిగింది. అదికాస్తా ప్రేమ‌కు (Love Story) దారితీసిరింది. మూడేండ్లు క‌లిసి ప్ర‌యాణం చేశారు. ఇరువురి ఇండ్ల‌లోనూ వారి పెండ్లికి (Marriage) ఒప్పుకున్నారు.

G

Hyderabad | Published On May 24, 2026, 1.22 pm IST

Love Story | ఇన్‌స్టా ప‌రిచ‌యంతో మొద‌లైన ప్రేమ‌క‌థ‌.. ఆత్మ‌హ‌త్య‌తో ముగిసింది..
Advertisement

Love Story | త్రినేత్ర‌.న్యూస్‌: వారిద్ద‌రిని ఇన్‌స్టాగ్రామ్ (Instagram) క‌లిపింది. ఇరుమ‌ధ్య ప‌రిచ‌యం పెరిగింది. అదికాస్తా ప్రేమ‌కు (Love Story) దారితీసిరింది. మూడేండ్లు క‌లిసి ప్ర‌యాణం చేశారు. ఇరువురి ఇండ్ల‌లోనూ వారి పెండ్లికి (Marriage) ఒప్పుకున్నారు. ఆ త‌ర్వాత అమ్మాయి క్ర‌మంగా దూరం పెరుగుతుండ‌టంతో మ‌న‌స్థాపానికి గురైన ప్రేమికుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి (Suicide) పాల్ప‌డ్డాడు. అలా ఇన్‌స్టాగ్రామ్‌తో మొద‌లైన వారి ప్రేమ‌క‌థ‌.. చివ‌రికి ఆత్మ‌హ‌త్య‌తో ముగిసింది. ఈ నెల 21న హైద‌రాబాద్ నాగోల్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

నాగోల్ ప‌రిధిలోని త‌ట్టిఅన్నారంకు చెందిన 24 ఏండ్ల పీ. తిరుమ‌ల్‌కు మూడేండ్ల క్రితం ఓ యువ‌తి ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌రిచ‌యం అయింది. మాటామాటా క‌ల‌వ‌డంతో ఇద్ద‌రు స్నేహితుల‌య్యారు. ఇద్ద‌రు త‌ర‌చూ క‌ల‌వ‌డం, క‌లిసి తిర‌గడం వంటివి చేశారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. మూడేండ్లు చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. ఇరువురి ఇండ్ల‌లోనూ వారి విష‌యం తెలిసింది. పెద్దలు కూడా వారి పెండ్లికి ఒప్పుకున్నారు. ఇంత‌లోనే అమ్మాయి ప్లేట్ ఫిరాయించింది. తిరుమ‌ల్‌ను క్ర‌మంగా దూరం పెడుతూ వ‌చ్చింది. అత‌డిని పెండ్లి చేసుకోవ‌డానికి నిరాక‌రించింది. దీంతో ప్రాణానికంటే ఎక్కువ‌గా ప్రేమించిన యువ‌తి తిర‌స్క‌రించ‌డంతో మ‌న‌స్థాపానికి గుర‌య్యాడు. గ‌త గురువారం (మే 21న‌) ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీంతో వారి ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ‌కథ విషాందాంతం అయింది.

గ‌త మూడు నెల‌లుగా యువ‌తి త‌మ కుమారుడిని దూరం పెడుతున్న‌ద‌ని తిరుమ‌ల్ తండ్రి సుబ్బారావు చెప్పారు. పెండ్లి చేసుకోవాల‌నికి నిరాక‌రించిందని తెలిపారు. మ‌న‌స్థాపంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని వెల్ల‌డించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాతుదో కేసు న‌మోదుచేసిన నాగోల్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement