త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jalamandali | అక్రమంగా అమర్చిన 13 మోటార్లు స్వాధీనం

Jalamandali | తాగునీటి సరఫరా పైపులైన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్న వారిపై జలమండలి విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం శంషాబాద్ జోన్ పరిధిలోని డివిజన్‌-8, కొత్వాల్ గూడ వార్డులోని ఆర్‌బీ నగర్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 13 అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.

S

Hyderabad | Published On Oct 28, 2026, 6.05 pm IST

Jalamandali | అక్రమంగా అమర్చిన 13 మోటార్లు స్వాధీనం
Advertisement

శంషాబాద్ జోన్‌లో జలమండలి విజిలెన్స్ అధికారుల తనిఖీలు

Jalamandali | త్రినేత్ర న్యూస్ : తాగునీటి సరఫరా పైపులైన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్న వారిపై జలమండలి విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం శంషాబాద్ జోన్ పరిధిలోని డివిజన్‌-8, కొత్వాల్ గూడ వార్డులోని ఆర్‌బీ నగర్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 13 అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. బుధ‌వారం ఉదయం 11 గంటలకు జలమండలి విజిలెన్స్ బృందం ఈ తనిఖీలు చేపట్టింది.

తాగునీటి సరఫరా పైపులైన్లకు అక్రమంగా అమర్చిన మోటార్లను గుర్తించి తొలగించారు. తాగునీటి పైపులైన్లకు నేరుగా మోటార్లు బిగించి నీటిని తోడుకోవడం వల్ల ఇతర వినియోగదారులకు సరిపడా నీరు అందకపోవడంతో పాటు సరఫరా ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని జలమండలి పేర్కొంది. అక్రమ మోటార్ల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Advertisement
Advertisement