త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jayesh Ranjan | జీహెచ్ఎంసీ స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా జ‌యేశ్ రంజ‌న్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

Jayesh Ranjan | గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ జ‌యేశ్ రంజ‌న్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో జ‌యేశ్ రంజ‌న్ బుధ‌వారం ఉద‌యం స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

S

Hyderabad | Published On Feb 11, 2026, 3.50 pm IST

Jayesh Ranjan | జీహెచ్ఎంసీ స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా జ‌యేశ్ రంజ‌న్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌
Advertisement

Jayesh Ranjan | త్రినేత్ర‌.న్యూస్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ జ‌యేశ్ రంజ‌న్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో జ‌యేశ్ రంజ‌న్ బుధ‌వారం ఉద‌యం స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ క‌మిష‌న‌ర్లు ఆర్వీ క‌ర్ణ‌న్, శ్రీజ‌న‌, విన‌య్ కృష్ణారెడ్డి హాజ‌ర‌య్యారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్‌లతో పాటు కార్పొరేటర్ల పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. దీంతో స్పెషల్ ఆఫీసర్ పాలన బుధవారం నుంచి ప్రారంభ‌మైంది. ఎన్నికలు జరిగి మళ్లీ మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నకునేంత వరకు స్పెష‌ల్ ఆఫీస‌ర్ పాల‌న కొనసాగ‌నుంది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్, సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌కు జ‌యేశ్ రంజ‌న్ ప్ర‌త్యేక అధికారిగా పాల‌న కొన‌సాగించ‌నున్నారు.

ఇక జీహెచ్ఎంసీతో పాటు కొత్త‌గా ఏర్ప‌డిన సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్, మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌కు కొత్త క‌మిష‌న‌ర్ల‌ను ప్ర‌భుత్వం నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా ఆర్వీ క‌ర్ణ‌న్‌ను యథావిధిగా కొన‌సాగిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ జీ శ్రీజ‌న‌ను సైబ‌రాబాద్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా, మ‌రో అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ టీ విన‌య్ కృష్ణారెడ్డిని మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌గా నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురు కూడా క‌మిష‌న‌ర్లుగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

Advertisement
Advertisement