త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRAA | అక్రమ నీటి వ్యాపారంపై హైడ్రా ఉక్కుపాదం.. ఫాక్స్‌ సాగర్‌ వద్ద మరో 7 అక్రమ బోర్లు తొల‌గింపు

HYDRAA | భూగర్భ జలాల అక్రమ వెలికితీత, విక్రయాలపై హైడ్రా (HYDRAA) చర్యలు ముమ్మరం చేసింది. జీడిమెట్ల పరిధిలోని ఫాక్స్‌ సాగర్‌ సమీపంలో మంగళవారం మరో ఏడు అక్రమ బోర్లను తొలగించింది. దీంతో రెండు రోజుల వ్యవధిలో తొలగించిన అక్రమ బోర్ల సంఖ్య 38కి చేరింది.

P

Hyderabad | Published On Oct 27, 2026, 9.30 pm IST

HYDRAA | అక్రమ నీటి వ్యాపారంపై హైడ్రా ఉక్కుపాదం.. ఫాక్స్‌ సాగర్‌ వద్ద మరో 7 అక్రమ బోర్లు తొల‌గింపు
Advertisement

HYDRAA | భూగర్భ జలాల అక్రమ వెలికితీత, విక్రయాలపై హైడ్రా (HYDRAA) చర్యలు ముమ్మరం చేసింది. జీడిమెట్ల పరిధిలోని ఫాక్స్‌ సాగర్‌ సమీపంలో మంగళవారం మరో ఏడు అక్రమ బోర్లను తొలగించింది. దీంతో రెండు రోజుల వ్యవధిలో తొలగించిన అక్రమ బోర్ల సంఖ్య 38కి చేరింది. ఫాక్స్‌ సాగర్‌ పరిసరాల్లో అనుమతులు లేకుండా పలుచోట్ల బోర్లు వేసి నీటిని వాణిజ్య అవసరాలకు విక్రయిస్తున్నట్లు హైడ్రా గుర్తించింది. ఈ క్రమంలో ఆరు బోర్లను తనిఖీ చేయడంతోపాటు, కొంపల్లి సమీపంలో సాగుతున్న అక్రమ నీటి వ్యాపారాన్ని వెలుగులోకి తెచ్చింది. సరస్సు సమీపంలోని కంటైనర్ల నుంచి ట్యాంకర్లలోకి నీటిని నింపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించింది.

ప్రైవేటు ట్యాంకర్లపై హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (HMWSSB) స్టిక్కర్లు అతికించి, వాటర్‌ బోర్డు వాహనాలుగా కనిపించేలా చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ అక్రమ కార్యకలాపాలను అడ్డుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ఒక ప్రకటనలో తెలిపింది. ఫాక్స్‌ సాగర్‌ పరిసరాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన ఏడు బోర్లతోపాటు వాటికి అనుసంధానించిన పైపులైన్లను తొలగించినట్లు పేర్కొంది. నీటి నిల్వ, సరఫరా కోసం ఏర్పాటు చేసిన భారీ షెడ్లు, ప్లాస్టిక్‌ ట్యాంకులను కూడా గుర్తించింది. మరిన్ని బోర్లు తవ్వేందుకు జరుగుతున్న ఏర్పాట్లను సైతం అడ్డుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే సున్నం చెరువు సమీపంలో 25 బోర్లను, మాదాపూర్‌లోని తమ్మిడికుంట పరిసరాల్లో ఆరు బోర్లను తొలగించినట్లు హైడ్రా తెలిపింది. భూగర్భ జలాలను అక్రమంగా తోడుతూ వాణిజ్య అవసరాలకు విక్రయించే కార్యకలాపాలపై నిఘా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.

Advertisement
Advertisement