త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRA | మైలార్‌దేవుపల్లిలో హైడ్రా కూల్చివేతలు.. 

HYDRA | హైద‌రాబాద్‌లో హైడ్రా (HYDRA) మ‌రోసారి కూల్చివేతలు చేప‌ట్టింది. మైలార్‌దేవుపల్లి (Mailardevpally) సర్కిల్‌లో పార్క్ స్థ‌లంలో నిర్మాణాల‌ను కూల్చివేసింది.

G

Hyderabad | Published On Apr 1, 2026, 11.01 am IST

HYDRA | మైలార్‌దేవుపల్లిలో హైడ్రా కూల్చివేతలు.. 
Advertisement

HYDRA | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో హైడ్రా (HYDRA) మ‌రోసారి కూల్చివేతలు చేప‌ట్టింది. మైలార్‌దేవుపల్లి (Mailardevpally) సర్కిల్‌లో పార్క్ స్థ‌లంలో నిర్మాణాల‌ను కూల్చివేసింది. మైలార్‌దేవుపల్లిలో సర్వే నంబరు 134/20 శాస్త్రిపురానికి చెందిన 6500 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. విచార‌ణ చేప‌ట్టిన అధికారులు నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మిన‌ట్లు గుర్తించారు. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచే భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. పార్క్‌ స్థలంలో నిర్మాణాలను నేలమట్టం చేసింది.

అంతకుముందు మంగళవారం కూడా హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మంచిరేవుల గ్రామంలోని నాగిరెడ్డికుంటలో 7 ఎకరాలల్లో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించింది. దీంతో బౌరంపేట్‌లోని గండిమైసమ్మ-మియాపూర్‌ రహదారికి ఇరువైపులా ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన రేకుల షెడ్లను హైడ్రా నేలమట్టం చేసింది.

Advertisement
Advertisement