త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజ‌ర్లు అరెస్ట్.. 8 స్కూట‌ర్లు స్వాధీనం

Hyderabad | హైద‌రాబాద్‌లో (Hyderabad) ద్విచ‌క్ర వాహ‌నాల ( Two Wheelers) దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రు మైన‌ర్ల‌ను (Juveniles) మైలార్‌దేవ్‌ప‌ల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 స్కూట‌ర్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

G

Hyderabad | Published On Sep 29, 2026, 1.00 pm IST

Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజ‌ర్లు అరెస్ట్.. 8 స్కూట‌ర్లు స్వాధీనం
Advertisement

Hyderabad | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్‌లో (Hyderabad) ద్విచ‌క్ర వాహ‌నాల ( Two Wheelers) దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రు మైన‌ర్ల‌ను (Juveniles) మైలార్‌దేవ్‌ప‌ల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 స్కూట‌ర్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 20న మైలార్‌దేవ్‌ప‌ల్లిలోని (Mailardevpall) టీఎన్‌జీవోస్ కాల‌నీలో రాహుల్ రెడ్డి అనే వ్య‌క్తికి చెందిన యాక్టివా స్కూట‌ర్‌, గ‌ణేశ్ మండ‌పం వ‌ద్ద స్పీక‌ర్ దొంగ‌త‌నానికి గుర‌య్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు న‌మోదుచేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. ఇద్ద‌రు మైన‌ర్ బాలురులు దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు.

ప్ర‌త్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను అదుపులోకి తీసుకోవ‌డంతోపాటు వారి వ‌ద్ద ఉన్న 8 స్కూట‌ర్ల‌ను (Scooter) స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఓ బాలుడి వయసు 14-15 ఏండ్లు కాగా (నల్లకుంట చెరువు కట్ట ప్రాంతం) కాగా, మరొకరి వయసు 13 సంవత్సరాలు (కూకట్‌పల్లి ప్రాంతం). స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే కేసును ఛేదించిన మైలార్‌దేవ్‌ప‌ల్లి పోలీసుల‌ను ఉన్న‌తాధికారులు అభినందించారు.

Advertisement
Advertisement