H-FAST Raids | అక్కడే గుట్కా ఉమ్మి.. అక్కడే అప్పడాలు తయారు చేస్తున్నారు
H-FAST Raids | నగరంలో కల్తీ ఆహార ఘటనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టి అధికారులు దాడులు నిర్వహిస్తున్నా ఈ కల్తీ దందా ఆగడం లేదు. తమకేం పట్టనట్లు యథేచ్ఛగా తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అప్పడాలు తయారు చేస్తున్న చోటనే గుట్కా ఉమ్మి వేసిన ఘటన తాజాగా మైలార్‌దేవ్‌పల్లిలో వెలుగు చూసింది.
H-FAST Raids | త్రినేత్ర.న్యూస్: నగరంలో కల్తీ ఆహార ఘటనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టి అధికారులు దాడులు నిర్వహిస్తున్నా ఈ కల్తీ దందా ఆగడం లేదు. తమకేం పట్టనట్లు యథేచ్ఛగా తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అప్పడాలు తయారు చేస్తున్న చోటనే గుట్కా ఉమ్మి వేసిన ఘటన తాజాగా మైలార్‌దేవ్‌పల్లిలో వెలుగు చూసింది. బాబుల్ రెడ్డి నగర్‌లో ఉన్న జేఎస్‌ఆర్ ప్రొడక్ట్స్ (JSR Products)పై తనిఖీలు నిర్వహించగా షాకింగ్ విషయాలు బయట పడ్డాయి.
హెచ్-ఫాస్ట్ (H-FAST) ఎస్సై వి.శంకర్, హెచ్-ఫాస్ట్ బృందం, ఎఫ్‌ఎస్‌ఓ (FSO) కె. సౌమ్యరెడ్డి కలిసి మైలార్‌దేవ్‌పల్లిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో ఉన్న జెఎస్‌ఆర్ ప్రొడక్ట్స్ (JSR Products) పై తనిఖీలు చేపట్టారు. ఈ తయారీ కేంద్రంలో ఎలాంటి పరిశుభ్రత లేని వాతావరణంలో, అనుమానాస్పదంగా ఉన్న నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను ఉపయోగిస్తూ వడియాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ తయారు చేస్తున్న చోటే గుట్కా ఊడ్చిన ఆనవాళ్లు ఉన్నాయి.

వడియాలను, ఎండు ఉల్లిపాయ రింగ్స్‌ను నేరుగా నేలపై ఆరబెట్టడం, తయారీకి సరిపడని ప్లాట్‌ఫారమ్‌లు, ఫుడ్ హ్యాండ్లర్లు ప్రొటెక్టివ్ గేర్ ధరించకపోవడం, వాడిన ఫార్మాస్యూటికల్ కార్టన్‌లలో సేమియాను ప్యాక్ చేయడం వంటివి గుర్తించారు. అలాగే వాటర్ అనాలిసిస్ రిపోర్టులు, ల్యాబొరేటరీ రిపోర్టులు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల వంటివి విధిగా నిర్వహించాల్సి ఉండగా పట్టిఒచుకోవడం లేదు. ల్యాబ్ పరీక్షల కోసం వడియాల నమూనాలను సేకరించి పంపించారు. పరీక్ష ఫలితాల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును ఫుడ్ సేఫ్టీ అధికారికి బదిలీ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
- ●Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?

Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ

Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు





