Traffic Advisory | బక్రీద్ పండుగ.. సాయంత్రం 5 నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Advisory | బక్రీద్ పండుగ (Bakrid Festival) నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Advisory) విధించారు. మేకలు, గొర్రెల విక్రయాల నేపథ్యంలో టోలిచౌకి - నానల్ నగర్ - రేతిబౌలి మార్గంలో (రోడ్డుకు ఇరువైపులా), అలాగే రేతిబౌలి నుండి అత్తాపూర్ రోడ్డు వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
Traffic Advisory | త్రినేత్ర.న్యూస్: బక్రీద్ పండుగ (Bakrid Festival) నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Advisory) విధించారు. మేకలు, గొర్రెల విక్రయాల నేపథ్యంలో టోలిచౌకి - నానల్ నగర్ - రేతిబౌలి మార్గంలో (రోడ్డుకు ఇరువైపులా), అలాగే రేతిబౌలి నుండి అత్తాపూర్ రోడ్డు వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చూసేందుకు మరియు ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి, బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి గురువారం ఉదయం 4 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ వెల్లడించారు. అందువల్ల దీనికి తగినట్లుగా వాహనదారులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ప్రత్యామ్నాయ మార్గాలు..
రాయదుర్గం, గచ్చిబౌలి నుండి మెహదీపట్నం వైపు వచ్చే వాహనాలు: ప్రత్యామ్నాయ మార్గాలైన ఫిల్మ్ నగర్ రోడ్డు (షేక్‌పేట ఫ్లైఓవర్ కింద నుంచి), బృందావన్ కాలనీ రోడ్డు (షేక్‌పేట ఫ్లైఓవర్ ర్యాంప్ దాటిన తర్వాత) ద్వారా వెళ్లవచ్చు.
లక్డీకాపూల్ నుంచి రాయదుర్గం, గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలు: మాసాబ్ ట్యాంక్ జంక్షన్ వద్ద కుడి వైపునకు తిరిగి, బంజారాహిల్స్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లవచ్చు.
మెహదీపట్నం నుంచి రాయదుర్గం, గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలు: నానల్ నగర్ వద్ద ఎడమ వైపునకు తిరిగి, లంగర్ హౌస్, నార్సింగి రోడ్డు మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లవచ్చు.
మాసాబ్ ట్యాంక్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లే వాహనాలు: ప్రత్యామ్నాయ మార్గమైన PVNR ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 2 & 3 వద్ద ఎడమ మలుపు తీసుకుని, మిరాజ్ కేఫ్ - గుడిమల్కాపూర్ మార్గం ద్వారా వెళ్లవచ్చు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు: రాత్రి సమయాల్లో మెహదీపట్నం - టోలిచౌకి మార్గాన్ని నివారించాలని మరియు ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ద్వారా ప్రయాణించాలని సూచించడమైనది.
- తాజా ట్రాఫిక్ అప్‌డేట్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్ పేజీ (facebook.com/HYDTP), @HYDTP (ట్విట్టర్/X హ్యాండిల్) అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా, ప్రయాణ సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626కు కాల్ చేయవచ్చని చెప్పారు.
🚦Traffic Advisory | Bakrid Festival-2026
Due to Bakrid Festival and sale of goats/sheep on 27 & 28.05.2026, heavy traffic congestion is expected from ⏰ 5 PM to 4 AM at Tolichowki–Nanal Nagar–Rethibowli stretch and Rethibowli–Attapur road.
Traffic diversions &… pic.twitter.com/SD7PjZSQOn
— Hyderabad Traffic Police (@HYDTP) May 27, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hyderabad Police Overstaying Foreigners | వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే అక్రమంగా ఉంటూ విదేశీయులు ఏం చేస్తున్నారంటే?
అక్టోబర్ 3, 2026

Akbaruddin Owaisi | నా వయసైపోయింది.. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
అక్టోబర్ 3, 2026

Bolarum Arms Theft | బొల్లారం మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: ముగ్గురు జవాన్లు సహా మరో ఏడుగురు అరెస్ట్.. అసలు స్కెచ్ అదే
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Tirumala | పెటరాసి మాసం.. తిరుమలకు పోటెత్తిన భక్తజనం..
- ●Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం
- ●Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్
- ●Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
- ●Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్
- ●TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!

Tirumala | పెటరాసి మాసం.. తిరుమలకు పోటెత్తిన భక్తజనం..

Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం

Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్

Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్



