NEET Student | కానూరులో నీట్ కోచింగ్.. కుటుంబానికి దూరంగా ఉండలేక హైదరాబాద్ యువతి బలవన్మరణం
NEET Student | ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కానూరులో నీట్ శిక్షణ (NEET Student) పొందుతున్న హైదరాబాద్ (Hyderabad) యువతి ఆత్మహత్య చేసుకున్నది. మూడు వారాల క్రితమే అక్కడికి వెళ్లిన విద్యార్థి అంతలోనే బలవన్మరణం చెందడం గమనార్హం.
NEET Student | త్రినేత్ర.న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కానూరులో నీట్ శిక్షణ (NEET Student) పొందుతున్న హైదరాబాద్ (Hyderabad) యువతి ఆత్మహత్య చేసుకున్నది. మూడు వారాల క్రితమే అక్కడికి వెళ్లిన విద్యార్థి అంతలోనే బలవన్మరణం చెందడం గమనార్హం.
హైదరాబాద్ బేగంపేటకు చెందిన కంతేటి వైష్ణవి (19).. నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం కానూరులోని శ్రీ భారతి ఇన్‌స్టిట్యూట్‌లో మూడు వారాల క్రితం చేరింది. ఇటీవలే ఇంటికి వచ్చిన ఆమె.. రెండు రోజుల క్రితమే మళ్లీ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లింది. అయితే కుటుంబానికి దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టంలేని వైష్ణవి.. ఇంత దూరంలో ఉండి చదవలేనంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన తన బాధను చెప్పుకుంది. అయితే బిడ్డ భవిష్యత్తు బాగుండాలని భావించిన తల్లిదండ్రులు ఆమెకు సర్దిచెప్పారు. ఇంతలోనే తనకు ఆరోగ్యం బాగాలేదని కాలేజీకి వెళ్లకుండా హాస్టల్ రూమ్‌లోనే (Coaching Hostel) ఉండిపోయిన ఆమె.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
హాస్టల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వదవాఖానకు తరలించారు. యువతి మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. చదువు కోసం వెళ్లిన తమ బిడ్డ ఇలా విగతజీవిగా మారడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Tellam Venkat Rao | డీసీఎంను ఢీకొట్టిన కారు.. భద్రాచలం ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
ఆగస్టు 7, 2026

Hyderabad | గణేశుడి లడ్డూ పంచాడు.. అపార్ట్మెంట్ వాసులను రూ.కోట్లలో ముంచాడు
ఆగస్టు 7, 2026

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Doctor Suspended | తనకు బదులు విధులకు మరో వ్యక్తి.. జోగిపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు
- ●Shaking well | బావిలో నిరంతరం ఎగసిపడుతున్న అలలు.. వీడియో వైరల్
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?
- ●Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..
- ●Stock Markets | ఐటీ షేర్ల జోష్.. మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..
- ●Harish Rao | నేతన్న బతికితేనే.. మన చేనేత బతుకుతుంది: హరీశ్ రావు

Doctor Suspended | తనకు బదులు విధులకు మరో వ్యక్తి.. జోగిపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు

Shaking well | బావిలో నిరంతరం ఎగసిపడుతున్న అలలు.. వీడియో వైరల్

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?

Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..



